INDIA Alliance: ఇండియా కూటమిలో లుకలుకలు.. సోనియాగాంధీ నివాసంలో పార్టీ అగ్రనేతల భేటీ..

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అయితే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమిలో లుకలకలకు దారితీశాయి.

INDIA Alliance: ఇండియా కూటమిలో లుకలుకలు.. సోనియాగాంధీ నివాసంలో పార్టీ అగ్రనేతల భేటీ..
India Alliance

Updated on: Dec 04, 2023 | 9:15 PM

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో పార్టీ అధికారం కోల్పోవడం, మధ్యప్రదేశ్ లో కూడా పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంపై సమీక్ష జరిపారు. 2018 ఎన్నికలలో గెలిచినప్పటికీ మధ్యప్రదేశ్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణలో గెలిచినప్పటికీ.. కీలక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో నేతల కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమిలో లుకలకలకు దారితీశాయి. కాంగ్రెస్‌ ఒంటెద్దుపోకడల తోనే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచినా, ఇండియా కూటమి ఓట్లు చీలడం వల్ల మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని బెంగాల్‌ CM మమతా బెనర్జీ అన్నారు. సీట్ల సర్దుబాటు ఉండాలని తాము చెప్పామని దీదీ గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలవాలంటే సైద్ధాంతిక బలంతోపాటు, వ్యూహం కూడా అవసరమన్నారు. 2024 ఎన్నికల్లో గెలవాలంటే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే, బీజేపీ అధికారంలోకి రాదన్నారు.

బీజేపీ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే, క్రమశిక్షణ కావాలని సమాజ్‌వాది చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ కాంగ్రెస్‌కు చురకలు పెట్టారు. కలసికట్టుగా పనిచేస్తే, మున్ముందు ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పారాయన. మధ్యప్రదేశ్‌లో తమను సీట్ల సర్దుబాటుకు పిలిచి, సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ అవమానించిందని అఖిలేష్‌ మొన్నీమధ్యే విమర్శించారు.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమిలో అభిప్రాయభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ , జేడీయూ కూడా ఎన్నికల బరిలో ఉండడంతో ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరింది. తెలంగాణలో గెలిచినప్పటికి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమిని హైకమాండ్‌ జీర్ణించుకోలేకపోతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..