Congress: కాంగ్రెస్‌కు పూర్వవైభవంపై అధినేత్రి దృష్టి.. జీ-23 నేతలతో సోనియాగాంధీ వరుస భేటీలు!

|

Mar 23, 2022 | 8:58 AM

కాంగ్రెస్‌కు పూర్వవైభవంపై దృష్టి పెట్టారు అధినేత్రి సోనియాగాంధీ. జీ-23 నేతలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు సీనియర్‌ నేతలతో సమావేశమైన సోనియా..త్వరలో మరోసారి భేటీ అవనున్నట్టు తెలుస్తోంది.

Congress: కాంగ్రెస్‌కు పూర్వవైభవంపై అధినేత్రి దృష్టి..  జీ-23 నేతలతో సోనియాగాంధీ వరుస భేటీలు!
Sonia Gandhi
Follow us on

Sonia Gandhi Meeting: కాంగ్రెస్‌(Congress)కు పూర్వవైభవంపై దృష్టి పెట్టారు అధినేత్రి సోనియాగాంధీ. జీ-23 నేతల(G-23 Leaders)తో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు సీనియర్‌ నేతలతో సమావేశమైన సోనియా..త్వరలో మరోసారి భేటీ అవనున్నట్టు తెలుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. ఇటు అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ.. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది.

పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు సోనియాగాంధీ. ముందుగా పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారంపై దృష్టి సారించిన సోనియాగాంధీ.. రెండ్రోజుల క్రితం సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. జి-23 నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కాంగ్రెస్‌ సీనియర్ నేతలు మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మతో సమావేశమయ్యారు. వారితో చాలా సేపు మంతనాలు జరిపారు. పార్టీ బలోపేతానికి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించినట్టు తెలుస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత పోరుపై మనీష్ తివారీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమైందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు పార్టీతో వీరికి ఏర్పడ్డ గ్యాప్‌ను కూడా పూరించ‌డంపై సోనియా వీరితో చ‌ర్చించారు. ఇక జి-23 బృందానికి చెందిన మరికొందరు నేతలతోనూ సోనియా త్వరలోనే సమావేశం కానున్నట్టు తెలిపాయి పార్టీ వర్గాలు . అగ్రనేత రాహుల్‌గాంధీ విధేయులుగా గుర్తింపు పొందిన పలువురు నేతలను ఏఐసీసీ పదవుల నుంచి తప్పించాలని జి-23 నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. వీరి సూచనలు, సలహాలు తీసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సానుకూలంగా స్పందించిన పార్టీ నాయకత్వం.. వీరిలో కొందరికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, లేదా పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also…

ED Raids: మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు.. సీఎం బావమరిదికి చెందిన రూ.6.25 కోట్ల స్థిరాస్తులు సీజ్‌