AICC meeting: జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. అప్రమత్తమైన కాంగ్రెస్.. ఎఐసీసీ కీలక భేటీ

|

Jun 24, 2021 | 10:42 AM

ప్రస్తుతం దేశ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు వార్తల నేపథ్యంలో ఎఐసీసీ అలర్ట్ అయింది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం.

AICC meeting: జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. అప్రమత్తమైన కాంగ్రెస్.. ఎఐసీసీ కీలక భేటీ
Sonia Gandhi
Follow us on

Sonia Gandhi convenes AICC meeting: ప్రస్తుతం దేశ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు వార్తల నేపథ్యంలో ఎఐసీసీ అలర్ట్ అయింది. ఇంతకాలం కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటూ వచ్చాయి. ఏ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్‌తో కలిసే పనిచేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మారిపోయింది.

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా బీజేపీని ఢీ కొట్టేందుకు కొత్తగా ఫ్రంట్ ఏర్పాటు అవుతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషర్ తెర వెనుక ఉండి శరద్ పవార్‌ను తెరపైకి తెచ్చి పావులు కదుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా పవార్‌తో భేటీ అవుతున్నారు.

బయటకు థర్డ్ ఫ్రంట్ అంటూ ఏది లేదని చెబుతున్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదో జరుగుతున్నట్టే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఈ ఫ్రంట్‌కు నేతగా చేస్తారనే ప్రచారం కూడా ఉంది. పలు రాష్ట్రాల్లో ఇంతకాలం కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఈ కొత్త ఫ్రంట్ వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఎవరూ కాంగ్రెస్‌ను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది. జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు, ఇతర అంశాలపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమైన సమావేశంలో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లతో పాటు, పీసీసీ అధ్యక్షులు వర్చువల్‌గా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలకు సంబంధించి మోదీ ప్రభుత్వం నిరసన తెలిపినందుకు బ్లూప్రింట్ తీసుకుంటామని చెబుతున్నారు.ఇది కాకుండా, కరోనా మహమ్మారి ప్రస్తుత పరిస్థితి మరియు దేశ రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సూచించే అవకాశం.

ఈ సమావేశం తరువాత టీపీసీసీ ఎంపికపైనా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో తెలంగాణలో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతోందని.. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎవరన్న ఉత్కంఠకు కూడా తెరదించే అవకాశం ఉంది..

Read Also….  మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.