Solar Heated Tent : శీతల ప్రాంతాల్లోని సరిహద్దుల వద్ద సైనికుల కోసం స్పెషల్ టెంట్.. ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..!

|

Feb 22, 2021 | 10:25 AM

దేశ రక్షణ కోసం ఎండ, వాన, చలి వీటిని లెక్క చేయకుండా తమ ప్రాణాలను సైతం ఫణంగా సైనికులు పెట్టి సరిహద్దుల వద్ద కావాలా కాస్తున్నారు. అయితే జమ్ము కాశ్మీర్, శ్రీనగర్, లడక్ వంటి ప్రాంతాల్లో శీతాకాలంలో గడ్డ కట్టే చలిలో..

Solar Heated Tent : శీతల ప్రాంతాల్లోని సరిహద్దుల వద్ద సైనికుల కోసం స్పెషల్ టెంట్.. ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..!
Follow us on

Solar Heated Tent : దేశ రక్షణ కోసం ఎండ, వాన, చలి వీటిని లెక్క చేయకుండా తమ ప్రాణాలను సైతం ఫణంగా సైనికులు పెట్టి సరిహద్దుల వద్ద కావాలా కాస్తున్నారు. అయితే జమ్ము కాశ్మీర్, శ్రీనగర్, లడక్ వంటి ప్రాంతాల్లో శీతాకాలంలో గడ్డ కట్టే చలిలో.. మంచు కొండలపై జవాన్లు కాపలా కాయడం అత్యంత క్లిష్టమైన పని. ఇక ఒకొక్కసారి ఇక్కడ చలికి సైనికులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఇప్పటివరకు సైనికుల క్యాంపుల్లో వాడే టెంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నావ్.. తాజాగా ఓ భారతీయ ఇంజనీర్ ఈ విధానానికి స్వస్తి చెప్పలా చేశాడు. వివరాల్లోకి వెళ్తే…

లడక్ కు చెందిన ఇంజనీర్ సోనమ్ వాంగ్ చుక్.. భారతీయ సైన్యం కోసం ప్రత్యేకంగా ఒక సోలార్ టెంట్ ను కనిపెట్టాడు.సైనికులు లడక్ వంటి ప్రాంతాల్లో సరిహద్దులకు కాపలాగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంటున్నారు. అటువంటివారికి ఈ సోలార్ టెంట్లు వారికి రక్షణగా ఉంటాయని సోనమ్ చెప్పారు. టెంట్ బయట మైనస్ డిగ్రీలు ఉన్నప్పటికీ టెంట్ లోపల సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. పదిమంది జవాన్లకు వసతి కల్పించే విధంగా ఈ టెంట్ ను తయారు చేశారు. దీని బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉంటుంది. ఈ సోలార్ టెంట్ పూర్తిగా పోర్టబుల్. కనుక సైనికులకు ఈ టెంట్ అత్యంత శీతల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుందని వారు సురక్షితంగా ఉంటారని చెప్పారు సోనమ్

Also Read:

దేశంలో కొత్త స్ట్రెయిన్ల కలకలం.. 5 రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న కేసులు.. వేగంగా క్షీణిస్తున్న రోగుల ఆరోగ్యం

కరోనా మళ్లీ విజృంభిస్తుండడానికి కారణం అదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిపుణులు..