Bangalore Crime: కుమారుడిపై కన్నతండ్రి కర్కశత్వం.. డబ్బులు పోగొట్టుకున్నాడని పెట్రోల్ పోసి నిప్పు.. ఆఖరుకు

|

Apr 07, 2022 | 6:13 PM

మనీ సంబంధాల కోసం మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. డబ్బు వ్యామోహంలో పడి కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్లు అనే కనికరం లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో తీవ్ర ఉద్వేగాలకు లోనై దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి....

Bangalore Crime: కుమారుడిపై కన్నతండ్రి కర్కశత్వం.. డబ్బులు పోగొట్టుకున్నాడని పెట్రోల్ పోసి నిప్పు.. ఆఖరుకు
fire
Follow us on

మనీ సంబంధాల కోసం మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. డబ్బు వ్యామోహంలో పడి కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్లు అనే కనికరం లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో తీవ్ర ఉద్వేగాలకు లోనై దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి పోలీసులకు(Police) చిక్కి కటకటాలపాలవుతున్నారు. తాజాగా బెంగళూరు(Banglaore)లో ఇలాంటి ఘటనే జరిగింది. కన్న కుమారుడు డబ్బులు పోగొట్టుకున్నాడని తండ్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కుమారుడిపై కర్కశంగా ప్రవర్తించి, పెట్రోల్(Petrol) పోశాడు. భయంతో బయటకు వచ్చినా వదలకుండా నిప్పంటించాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని చామరాజపేట్​పోలీస్​స్టేషన్​పరిధిలోని ఆజాద్​నగర్​లో నివాసముండే సురేంద్ర, అర్పిత్​తండ్రీ కొడుకులు. గతవారం అర్పిత్​రూ.12వేలు పోగొట్టుకున్నాడు. దీంతో సురేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సమయంలోనే కుమారుడిపై పెట్రోల్ పోశాడు. అర్పిత్ భయంతో బయటకు పరగులు తీయగా.. కనికరం లేకుండా నడిరోడ్డుపై అర్పిత్​కు నిప్పంటించాడు.

మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైన అర్పిత్.. వీధుల్లో పరుగులు తీశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పారు. కానీ అప్పటికే అర్పిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని విక్టోరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అర్పిత్ కు ఐసీయూలో చికిత్స అందించారు. కానీ చికిత్సకు అర్పిత్ స్పందించకపోవడంతో కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. సురేంద్ర తన కుమారుడికి నిప్పంటించిన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Also Read

Minister KTR: గవర్నర్ల వ్యవస్థతో ఎలాంటి పంచాయతీ లేదు.. గవర్నర్ ​తమిళిసై కామెంట్స్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్..

Bandla Ganesh: మీకు తిరుగులేదు దేవర.. పవర్‌స్టార్‌పై మరోసారి ప్రేమ కురిపించిన బండ్లన్న.. ట్వీట్‌ వైరల్‌..

CM Jagan: వాలంటీర్లది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ.. గ్రామాల్లో సచివాలయం వంటి వ్యవస్థ నడుస్తోందిః సీఎం జగన్