Fuel Price in India: ఉపశమనం..! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

|

Aug 26, 2021 | 8:47 AM

చెప్పాలంటే మాకు, చదవాలంటే మీకూ ఓ గుడ్‌న్యూస్‌ ఇది. కేంద్రమంత్రి చెప్పిన ఓ మాట విన్నాక.. అది కలా, నిజమా అనిపించింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటో తెలుసుకుందాం పదండి...

Fuel Price in India: ఉపశమనం..! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Fuel Price
Follow us on

చెప్పాలంటే మాకు, చదవాలంటే మీకూ ఓ గుడ్‌న్యూస్‌ ఇది. కేంద్రమంత్రి చెప్పిన ఓ మాట విన్నాక.. అది కలా, నిజమా అనిపించింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటో తెలుసుకుందాం పదండి. పెట్రోల్ ధర కొండెక్కి కూర్చున్న విషయం తెలిసిందే. డీజిల్ ధర కూడా ఇదే దారిలో పయనిస్తోంది. దీంతో సామాన్యులపై మరీముఖ్యంగా దిగువ మధ్యతరగతి వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇతరత్రా వాటి ధరలు కూడా పైకి చేరాయి. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేంద్రమంత్రి కాస్త ఊరటనిచ్చే మాట చెప్పారు. పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో దేశ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందన్నారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. పెట్రో ధరల అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితమైనదిగా భావిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాలపై సుంకాల పెంపును మంత్రి సమర్థించుకున్నారు. లీటరు పెట్రోల్‌పై ప్రభుత్వం 32 రూపాయల మేర ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తుందని..తద్వారా సమకూరిన డబ్బును ఉచిత రేషన్, టీకా కార్యక్రమం, వివిధ సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తుందని వెల్లడించారు. 2010 ఏప్రిల్‌లో నాటి సర్కారు లీటరు పెట్రోల్‌పై 32 రూపాయల సుంకం విధించేదని, ఇప్పుడూ అంతే మొత్తాన్ని తమ ప్రభుత్వం విధిస్తుందని హర్దీప్‌ సింగ్‌ వెల్లడించారు. యూపీఏ విధానాల కారణంగానే చమురు ధరలు పెరుగుతున్నాయని బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. యూపీఏ హయాంలో జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Also Read: ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీ మాట నిలబెట్టుకోలేకపోయాను’… ఎంసెంట్‌లో క్వాలిఫై కాకపోవడంతో..

 స్కూళ్లు తెరవకపోతే.. ఓ బాధ. తెరిస్తే మరో బాధ.. అయోమయ స్థితిలో పేరెంట్స్