విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్‌ రాశి ఏంటో తెలుసా? ప్రమాదం రోజు అతని రాశిఫలం..

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 269 మంది మరణించగా, విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ అద్భుతమైన తప్పించుకోవడంతో అతని రాశి, జాతకంపై ఆసక్తి పెరిగింది. కొందరు అతని రాశిని వృషభం అని, మరికొందరు తుల అని అంటున్నారు.

విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్‌ రాశి ఏంటో తెలుసా? ప్రమాదం రోజు అతని రాశిఫలం..
Pm Modi And Vishwas Kumar R

Updated on: Jun 13, 2025 | 11:51 PM

అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో మొత్తంగా 269 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన విమానం టేకాఫ్‌ అయిన 32 సెకన్లకే ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒకే ఒక్కడు సీట్‌ నంబర్‌ 11ఏ లో కూర్చున్న విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలి ముక్కలైంది. వెంటనే భారీ పేలుడు సంభవించింది. విమానంలో ఉన్న 1.25 లక్షల ఇంధనం కారణంగా అంత భారీ పేలుడు సంభవించింది.

అంత ఘోర ప్రమాదం తర్వాత చిన్న చిన్న గాయలతో ఒక్కడు ప్రాణాలతో బయటపడి, నడుచుకుంటూ వచ్చాడంటూ ఎవరూ నమ్మలేదు. కానీ, అతని అదృష్టం కొద్ది రమేష్‌ బతికిపోయాడు. దీంతో అతని పేరు మీడియాలో, సోషల్‌ మీడియాలో మారుమోగిపోయింది. మృత్యువును జయించాడు, మృత్యుంజయుడు అంటూ అంతా అతని గురించే మాట్లాడుకున్నారు. అయితే కొంతమంది ఇంత పెద్ద ప్రమాదం నుంచి కూడా ప్రాణాలతో బయటపడ్డాడంటే.. ఇంతనిది ఏ రాశి అంటూ గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. జ్యోతిష్యాన్ని నమ్మే వారు.. అతని రాశి, జాతకం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే రాశి ఏంటో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి పుట్టిన తేదీ అవసరం. కానీ, రమేష్‌ పుట్టిన తేదీ ఏంటో ఎవరికీ తెలియదు. అయితే అతని పేరు ప్రకారం చూసుకుంటే..”విశ్వాస్ కుమార్ రమేష్” అనే పేరుకు వృషభ రాశి వస్తుంది. మొదటి పేరు విశ్వాస్‌ను తీసుకుంటే అతనిది వృషభ రాశిగా చెప్పుకోవచ్చు. అలాగే “రమేష్” అనే పేరు తీసుకుంటే తుల రాశి వస్తుంది. మొదటి పేరు ప్రామాణికం కాబట్టి అతనిది వృషభ రాశి అనుకుంటే.. ప్రమాదం జరిగిన రోజు అంటే జూన్‌ 12, 2025న విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ జాతకం అతనికి అనుకూలంగా ఉంది. జ్యోతిష్యాన్ని బలంగా నమ్మేవారు.. ఆ రోజు అతని జాతకం బాగుంది కాబట్టే అతని బతికిబట్ట కట్టాడు అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..