Snake Venom: అక్రమంగా పాము విషాన్ని అమ్ముతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్.. ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్..

|

Nov 21, 2021 | 12:41 PM

Snake Venom: కొందరు యువకులు అక్రమంగా పాము విషాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు వలవేసి.. ఆ నిందితులను..

Snake Venom: అక్రమంగా పాము విషాన్ని అమ్ముతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్.. ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్..
Snake Venom
Follow us on

Snake Venom: కొందరు యువకులు అక్రమంగా పాము విషాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు వలవేసి.. ఆ నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అక్రమంగా అమ్ముతున్న కిలో పాము విషాన్ని ఒడిశా సంబల్ పూర్ జిల్లాకు చెందిన పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాసారు. ఒక కిలో పాము విషం విలువ సుమారు  రూ. 1.5 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. పాము విషాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దేవ్‌ఘర్ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. సంబల్‌పూర్‌లోని సిందూర్‌పాంక్‌కు పోలీసులు కస్టమర్లుగా మారి..  నిందితులను కలవడానికి వెళ్లారు. పాము విషం అమ్ముతున్నవారిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.

కైలాష్ చంద్ర సాహు ,  రంజన్ కుమార్ పాధి అనే వ్యక్తులు గాజు పాత్రలో 1 కిలోల పాము  విషం అమ్మకానికి పెడితే.. మారువేషంలో పోలీసుల బృందంవారిని సంప్రదించింది. భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నవారిని సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు.  అయితే తాము స్వాధీనం చేసుకున్న పాము విషాన్ని నిర్ధారణ కోసం ప్రయోగశాలకు పంపుతాము” అని  పోలీసు అధికారి ప్రత్యూష్ మోహపాత్ర తెలిపారు. పాము విషం మందుల తయారీ, బీరు తయారీకి కూడా ఉపయోగిస్తాన్న సంగతి తెలిసిందే.

Also Read:  పైకి చూస్తే భారీ బంగాళదుంప.. లోపల చూస్తే సౌకర్యాల నిలయం..హోటల్ ఫోటోలు వైరల్..