10 అడుగుల గొయ్యిలో అస్థిపంజరాలు.. కాల్ రికార్డుతో బయటపడిన సంచలన నిజాలు.. అసలేం జరిగిందంటే!

Crime News Latest: 10 అడుగుల గోతులో పాతిపెట్టేశాడు. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

10 అడుగుల గొయ్యిలో అస్థిపంజరాలు.. కాల్ రికార్డుతో బయటపడిన సంచలన నిజాలు.. అసలేం జరిగిందంటే!
Skeltons

Updated on: Jun 30, 2021 | 1:03 PM

ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొద్దిరోజులు అంతా బాగానే ఉంది. అయితే అనూహ్యంగా కొద్దిరోజులకు యువకుడు మరో అమ్మాయితో వివాహానికి సిద్దమయ్యాడు. దీనితో ఆగ్రహించిన యువతి.. తన లవర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో, మొబైల్ నెంబర్‌ను సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న యువకుడు.. ఆ యువతిని, ఆమె కుటుంబసభ్యులను చంపి 10 అడుగుల గోతులో పాతిపెట్టేశాడు. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని నేమవర్ పట్టణానికి చెందిన రూపాలి, సురేంద్రలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొద్దిరోజులు పాటు వీరిద్దరి మధ్య అంతా బాగానే ఉంది. అయితే అనూహ్యంగా సురేంద్ర మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రూపాలి.. కోపంతో అతడు చేసుకోబోయే యువతి ఫోటో, మొబైల్ నెంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇక ఇది కాస్తా సురేంద్రకు తెలుస్తుంది. తాను పెళ్లి చేసుకోవాలంటే.. రూపాలి అడ్డు తొలగించుకోవాలని భావిస్తాడు. అంతే స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ రచిస్తాడు.

అందులో భాగంగానే మే 13వ తేదీన రూపాలి సోదరుడు పవన్(13)ను కలిసి.. మమతా బాయి(45), రూపాలి (21), దివ్య (14), పూజా ఓస్వాల్ (15)లను తాను చెప్పిన ప్రాంతానికి తీసుకురమ్మని చెబుతాడు. అనుకున్నట్లే వారంతా అక్కడికి చేరుకోగానే సురేంద్ర అందరినీ హత్య చేసి సమీప పొలంలో 10 అడుగుల గొయ్యి తవ్వి పాతిపెడతాడు.

కాల్ రికార్డుతో బయటపడ్డ సంచలన నిజాలు..

కొద్దిరోజులుగా రూపాలితో పాటు మిగిలిన వారంతా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనితో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కేసును తప్పుదోవ పట్టించేందుకు సురేంద్ర మరో పన్నాగం పన్నాడు. రూపాలి పోస్టు చేస్తుండగా.. ఆమె అకౌంట్ నుంచి తరచూ మెసేజ్‌లు పెట్టేవాడు. ఇక ఆ పోస్టులపై పోలీసులకు అనుమానం రావడంతో రూపాలి కాల్ లిస్టుపై ఫోకస్ పెట్టారు. అందులో సురేంద్రకు తరచూ కాల్స్ చేసినట్లు ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించగా.. అసలు విషయం బయటికి వచ్చింది.

తాను రూపాలిని ప్రేమించానని.. కానీ ప్రస్తుతం వేరే అమ్మాయితో వివాహానికి సిద్దమైనట్లు చెప్పుకొచ్చాడు. ఇందుకు రూపాలి అంగీకరించకపోవడంతో.. ఎప్పటికైనా ఆమె వల్ల ప్రమాదం వస్తుందని భావించి.. రూపాలితో పాటు తమ ప్రేమ గురించి తెలిసిన మిగతావారిని చంపేసినట్లుగా పేర్కొన్నాడు. కాగా, సురేంద్ర మృతదేహాలను పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లి.. జేసీబీ సాయంతో ఆస్థిపంజరాలను పోలీసులు బయటికి తీశారు.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!