పండగపూట విషాదం..! గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం..

|

Jan 12, 2023 | 12:00 PM

పండగవేళ విషాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. హర్యానా గురువారం (జనవరి 11) ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లొకెళ్తే..

పండగపూట విషాదం..! గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం..
ఫలితంగా ప్రమాదాలు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రమాదాలను నివారించడానికి ఇందులో ఇథైల్ మోర్కాంప్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు. అలాంటప్పుడు గ్యాస్‌ లీకైతే వెంటనే వాసన వస్తుంది. దీని వల్ల ప్రమాదం జరుగకుండా జాగ్రత్త పడవచ్చు.
Follow us on

పండగవేళ విషాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. హర్యానా గురువారం (జనవరి 11) ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లొకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కరీమ్‌ కుటుంబం పానిపట్ జిల్లా పానిపట్ తహసీల్ క్యాంపు ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కుటుంబం అంతా ఒకే గదిలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటల 30 నిముషాల ప్రాంతంలో వంట చేసుకుంటుండగాస్తుండగా గ్యాస్‌ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. నిముషాల వ్యవధిలో కుటుంబంలోని ఆరుగురు దుర్మరణం చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులను అబ్దుల్ కరీమ్ (48), అఫ్రోజ్‌ (45), ఇష్రత్ (18), రేష్మ (16), అబ్దుల్ షకూర్ (12) అఫ్సానా (8)గా గుర్తించారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తలరించారు. పశ్చిమ బెంగాల్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్పీ శశాంక్‌ కుమార్‌ సవాన్‌ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.