Heroin Seized: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ. 400 కోట్లు విలువ ఉంటుందన్న అధికారులు

|

Dec 20, 2021 | 9:38 AM

Heroin Seized: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత ముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది..

Heroin Seized: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ. 400 కోట్లు విలువ ఉంటుందన్న అధికారులు
Heroin Seized
Follow us on

Heroin Seized: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత ముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది. గుజరాత్ తీరం ప్రాంతంలో కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో పాకిస్తాన్ కు చెందిన బోటుని సీజ్ చేశారు. పాకిస్తాన్ బోటులో ఉన్న 77 కేజీల భారీ స్తాయిలో ఉన్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదే విషయంపై గుజరాత్ ATS డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హిమాన్షు శుక్లా స్పందిస్తూ.. పాకిస్తాన్ బోట్ ‘అల్ హుసేనీ’ భారత జలాల్లోకి ప్రవేశిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. ఈ బోటులో భారీగా హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లు.. వీటి విలువ రూ. 400 కోట్లు ఉంటుందని చెప్పారు. అంతేకాదు బోటులోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని విచారణ చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు పడవను సీజ్ చేసి జాఖౌకు తరలించారు. పాకిస్థాన్‌కు చెందిన స్మగ్లర్లు గుజరాత్ తీరాన్ని స్మగ్లింగ్ గూడ్స్, మత్తుపదార్ధాలను రవాణా చేయడానికి రవాణా మార్గంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారుని.. అయితే గత నాలుగేళ్లుగా అలాంటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని   తెలిపారు.

గుజరాత్ తీరం పొరుగు దేశమైన పాకిస్థానీ సమీపంలో ఉన్నందున పాకిస్తాన్ డ్రగ్ కార్టెల్స్  రవాణా మార్గంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ప్రయత్నాలన్నింటినీ గుజరాత్ పోలీసులు , ఇతర కేంద్ర ఏజెన్సీలు అడ్డుకున్నాయి. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మత్తుమందు రవాణా ప్రయత్నాలు నెరవేరవని తెలిపారు.  మనకు 1,600 కి.మీ-పొడవు తీరప్రాంతం ఉంది.. అందువల్ల అన్ని ఏజెన్సీలు సమన్వయంతో  డ్రగ్ రవాణా అడ్డుకోవడానికి పని చేస్తాయి,” అని శుక్లా చెప్పారు.

Also Read:  వామ్మో.. నెటిజన్లను షేక్ చేస్తున్న నాగులు.. మూడు ఒకేచోట మీటింగ్.. ఎందుకో ఏమో..