శబరిమల బంగారం చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. ప్రధాన పూజారి అరెస్ట్..!

శబరిమల బంగారం చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల‌యం నుంచి అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ అయినట్లు సిట్‌ గుర్తించింది. ఈ కేసులో శబరిమల ప్రధాన పూజారి (తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీలోకి తీసుకుంది. శబరిమల ఆలయ ప్రాంగణం నుండి విలువైన బంగారు ఆభరణాలు అదృశ్యం కావడంపై దర్యాప్తు సందర్భంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.

శబరిమల బంగారం చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. ప్రధాన పూజారి అరెస్ట్..!
Sabarimala Chief Priest Kandararu Rajeevaru Arrest

Updated on: Jan 09, 2026 | 3:39 PM

శబరిమల బంగారం చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల‌యం నుంచి అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ అయినట్లు సిట్‌ గుర్తించింది. ఈ కేసులో శబరిమల ప్రధాన పూజారి (తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీలోకి తీసుకుంది. శబరిమల ఆలయ ప్రాంగణం నుండి విలువైన బంగారు ఆభరణాలు అదృశ్యం కావడంపై దర్యాప్తు సందర్భంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.

కొన్ని రోజుల క్రితం, ఆలయం లోపల బంగారం దొంగతనం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. శబరిమల బంగారం చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. ఆలయంలోని మరిన్ని కళాకృతుల నుంచి కూడా బంగారం మాయం అయినట్లు సిట్‌ కొల్లాంలోని విజిలెన్స్‌ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ ద్వారపాలక విగ్రహాలు, ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లు రెండు కేసులు నమోదు చేసింది.

అయితే బంగారం చోరీ రెండు కళాకృతులకే పరిమితం కాలేదని సిట్‌ తెలిపింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. సన్నిధానం తలుపులకు ఉన్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5KGల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చాడని పేర్కొంది. చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్స్‌ వద్ద ఓ రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరుచేయడం జరిగిందని, ప్రస్తుతం అది బళ్లారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్‌ తన నివేదికలో పేర్కొన్నది. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పది మందిని సిట్ అరెస్టు చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా శబరిమల ప్రధాన పూజారి (తంత్రి) కందరారు రాజీవరును అదుపులోకి తీసుకుంది. రాజీవరును శుక్రవారం (జనవరి 09) ఉదయం ఒక గుర్తు తెలియని ప్రదేశంలో విచారించారు. ఈ తరువాత మధ్యాహ్నం SIT కార్యాలయానికి తరలించారు. అక్కడ అతని అరెస్టును అధికారికంగా నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్టు జరిగింది. SIT పరిశోధనల ప్రకారం, రాజీవరుకు ఉన్నికృష్ణన్ పొట్టితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆలయంలోని ద్వారపాలక (సంరక్షక దేవత) పలకలు, శ్రీకోవిల్ (గర్భగుడి) తలుపు చట్రపు పలకలను తిరిగి అమర్చాలని భావించారని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..