Sikkim Results 2024: సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదీ ఎవరు..?

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించిన కౌంటింగ్ సిబ్బంది, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించారు.

Sikkim Results 2024: సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదీ ఎవరు..?
Sikkim Polls Vote Counting

Updated on: Jun 02, 2024 | 8:52 AM

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించిన కౌంటింగ్ సిబ్బంది, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించారు. ఈవీఎంలలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓట్లను కొనసాగించే ముందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్ల లెక్కింపునకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రెనాక్ నియోజకవర్గంతోపాటు సోరెంగ్-చకుంగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయనకు బహుముఖ పోటీ ఉంది. సిక్కింలో 32 సీట్లు ఉండగా మెజారిటీకి 17 సీట్లు అవసరం.

సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. మొత్తం 32 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. నమోదైన 4.64 లక్షల మంది ఓటర్లలో 67.95 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 146 మంది అభ్యర్థుల్లో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కూడా ఉన్నారు. ఆయన రెండు స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమంగ్ భార్య కృష్ణ కుమార్ రాయ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ ఆటగాడు బైచుంగ్ భూటియా కూడా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డిఎఫ్) టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ డీఆర్ థాపా కూడా ఎన్నికల పోరులో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ అరుణ్ ఉప్రేతి, సీనియర్ మంత్రి లుంగా నీమా లెప్చా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…