PM Narendra Modi: సిక్కులు లేకుండా భారత చరిత్ర అసంపూర్ణమే.. సిక్కు ప్రతినిధుల సమావేశంలో ప్రధాని మోడీ

|

Apr 30, 2022 | 10:45 AM

PM Modi interaction with Sikh Delegation: సిక్కు సంప్రదాయం బలమైన భారతదేశానికి సజీవ ఉదాహరణ అని.. సమాజానికి సేవ, ధైర్యం, పరాక్రమం, శ్రద్ధ, జాతీయ స్ఫూర్తికి పర్యాయపదమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

PM Narendra Modi: సిక్కులు లేకుండా భారత చరిత్ర అసంపూర్ణమే.. సిక్కు ప్రతినిధుల సమావేశంలో ప్రధాని మోడీ
Pm Modi
Follow us on

PM Modi interaction with Sikh Delegation: సిక్కు సంప్రదాయం బలమైన భారతదేశానికి సజీవ ఉదాహరణ అని.. సమాజానికి సేవ, ధైర్యం, పరాక్రమం, శ్రద్ధ, జాతీయ స్ఫూర్తికి పర్యాయపదమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ప్రవాసులు జాతీయ రాయబారులంటూ ప్రధాని సిక్కు ఎన్నారైల సహకారాన్ని ప్రశంసించారు. సరిహద్దుల నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సిక్కుల సహకారం ఎంతో ఉందంటూ కొనియాడారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోడీ శుక్రవారం రాత్రి చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్, ఎన్ఐడీ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రన్ సత్నామ్ సింగ్ సంధు నేతృత్వంలోని 100 మంది సభ్యుల సిక్కు ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా సిక్కు సమాజంతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. గురుద్వారాలను సందర్శించడం, లంగర్‌లో పాల్గొనడం, సిక్కులతో కలిసి జీవించడం తన జీవిత ప్రయాణంలో భాగమంటూ ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. సిక్కు గురువులు తమ జీవితాన్నంతా దేశాన్ని ఏకం చేయడంతో పాటు భారతదేశం అంతటా ప్రత్యేకమైన ముద్ర వేశారంటూ కొనియాడారు.

సిక్కు సంప్రదాయం..’ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ వలే సజీవ సంప్రదాయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు, తరువాత సిక్కు సమాజం సహకారానికి దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటుందన్నారు. మహారాజా రంజిత్ సింగ్ ఇచ్చిన విరాళాలు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిక్కు పోరాటాలు, జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనల ప్రస్తావన లేకుండా భారతదేశ చరిత్ర అసంపూర్ణమే” అంటూ ప్రధాని మోదీ అభివర్ణించారు. సిక్కుల సేవ, స్ఫూర్తికి గర్వించదగినదని, ప్రపంచం మొత్తం వారిని గౌరవంతో చూస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా విదేశాల్లోని పలు సిక్కుల పుణ్యక్షేత్రాలను తాను సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని.. ఇప్పుడు కొత్త భారతదేశం ఆవిర్భవించనుందని పేర్కొన్నారు.

వాతావరణ సంక్షోభానికి పరిష్కారం చూపే దిశగా సాంస్కృతిక పద్ధతుల్లో భారత్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతి గ్రామంలో అమృత్ సరోవర్లను (చెరువులు) నిర్మించాలని ప్రతినిధులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ సమావేశంలో ప్రధాని మోదీ తలపాగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Punjab Violence: పాటియాలాలో హింస దురదృష్టకరం.. చర్యలు తీసుకుంటాం: సీఎం భగవంత్ మాన్

India Corona: దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?