PM Modi: ప్రధాని మోదీ జపాన్ పర్యటనలోని ముఖ్యమైన అంశాలు.. కీలక ఒప్పందాలు ఇవే!

ప్రధాని మోదీ జపాన్‌ పర్యటనలో భారత్-జపాన్ ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. జపాన్ రాబోయే పదేళ్లలో భారతదేశంలో 10 ట్రిలియన్ జపనీస్ యెన్ల ప్రైవేట్ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. రక్షణ, సాంకేతికత, శక్తి వంటి రంగాలలో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడటం ఈ పర్యటన ప్రధాన విజయంగా చెప్పవచ్చు.

PM Modi: ప్రధాని మోదీ జపాన్ పర్యటనలోని ముఖ్యమైన అంశాలు.. కీలక ఒప్పందాలు ఇవే!
Pm Modi Japan Visit

Updated on: Aug 30, 2025 | 12:25 PM

ఆర్థిక సహకారాన్ని పెంచే దృక్పథంతో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటించారు. ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో జపాన్‌ ప్రధాని మోదీతో పాటే ఉండటం విశేషం. జపాన్‌కు వెళ్లిన ప్రధాన మంత్రి మోదీకి జపాన్‌ ప్రధాన మంత్రి ఇషిబా స్వాగతం పలికారు. తరువాత ప్రతినిధి బృందం స్థాయి చర్చలు, విందులో పాల్గొన్నారు. మరుసటి రోజు నాయకులు టోక్యో నుండి సెండాయ్‌కు షింకన్‌సెన్ బుల్లెట్ రైలులో కలిసి ప్రయాణించి, కలిసి భోజనం చేశారు. టోక్యో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. జపాన్ ప్రధాని 2 రోజుల పాటు ప్రధాని మోడీతోనే ఉన్నారు. మరి ఈ పర్యటనలో భాగంగా జరిగిన కీలక ఒప్పందాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పెట్టుబడులు, ఒప్పందాలు

రాబోయే పదేళ్లలో భారత్‌లోకి JPY 10 ట్రిలియన్ల ప్రైవేట్ పెట్టుబడులకు జపాన్ కట్టుబడి ఉండటం అత్యంత ముఖ్యమైన ప్రకటనలలో ఒకటి. ఈ పర్యటన భారత్‌-జపాన్ సంబంధాల తదుపరి దశాబ్దాన్ని రూపొందించే మైలురాయి ఫలితాలకు మార్గం సుగమం చేసింది. దీని ప్రధాన లక్ష్యం ఇండియా-జపాన్ జాయింట్ విజన్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్. ఇది ఆర్థిక వృద్ధి, భద్రత, సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, స్థిరత్వం, చలనశీలత, ప్రజల మధ్య మార్పిడి వంటి కీలక రంగాలను కవర్ చేసే రోడ్ మ్యాప్‌గా చెప్పవచ్చు.

రక్షణ, మానవ వనరుల మార్పిడి నుండి డిజిటల్ ఆవిష్కరణ, కీలకమైన ఖనిజాలు, స్వచ్ఛమైన శక్తి, అంతరిక్ష అన్వేషణ, సాంస్కృతిక సహకారం వరకు విస్తృత శ్రేణి అవగాహన ఒప్పందాలపై సంతకం ఇరు దేశాల ప్రధానులు చేశారు.

ద్వైపాక్షిక మద్దతు

ఈ పర్యటనలో ఆసక్తికరమైన అంశం భారత్‌-జపాన్ సంబంధాల బలోపేతంగా చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ, ఇద్దరు మాజీ జపాన్ ప్రధానులు యోషిహిదే సుగా, ఫ్యూమియో కిషిడాను కలిశారు. అలాగే ఎంపీల బృందంతో పాటు స్పీకర్‌ను కూడా కలిశారు. భారత ముఖ్యమంత్రులకు సమానమైన 16 ప్రిఫెక్చర్ల గవర్నర్లు ప్రధాని మోదీతో సంభాషించడానికి టోక్యోను సందర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి