Karnataka: కర్నాటక కొత్త సీఎం ఆయనేనా.. ఫైనల్ నిర్ణయానికి వచ్చేసిన కాంగ్రెస్ అధిష్టానం

|

May 15, 2023 | 11:19 AM

కర్నాటక కొత్త సీఎం ఎవరు?. సిద్ధరామయ్యా? లేక డీకే శివకుమారా?. ఇద్దరిలో ఎవరిని సీఎం పదవి వరించబోతోంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎవరికి ఓటేయబోతుంది. సీరియారిటీగా, లాయల్టీకా!. అసలు ఢిల్లీలో ఏం జరగబోతోంది!.

Karnataka: కర్నాటక కొత్త సీఎం ఆయనేనా.. ఫైనల్ నిర్ణయానికి వచ్చేసిన కాంగ్రెస్ అధిష్టానం
Karnataka New Cm
Follow us on

సీఎం కుర్చీ కోసం హోరాహోరీగా తలపడుతున్నారు సిద్ధరామయ్య అండ్‌ డీకే శివకుమార్. ఇద్దరి మధ్య స్నేహసంబంధాలే ఉన్నా.. స్నేహం స్నేహమే.. సీఎం కుర్చీ సీఎం కుర్చీయే అంటున్నారు. హాట్‌ సీట్‌ కోసం ఇద్దరు ఒక రేంజ్‌లో లాబీయింగ్‌ చేస్తున్నారు. కర్నాటక సీఎం పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. కర్నాటక నెక్ట్స్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉంటారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దక్షిణాదిలో జరిగిన కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం, పార్టీ అధ్యక్షుడు నియమించిన కాంగ్రెస్ పరిశీలకులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీలతో కూడిన కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, అతని డిప్యూటీగా డీకే శివకుమార్‌కు ఇవ్వాలని నిర్ణయం వైపుగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. డీకేకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తుందా? లేక సీనియారిటీకే ఓటేస్తుందా! కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో సిద్ధరామయ్యకు సమానంగా డీకే శివకుమార్ పోటీ ఇస్తున్నారు. అదే సమయంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏ క్షణంలోనైనా సీఎం పేరును ప్రకటించవచ్చు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, తాను ఢిల్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని శివకుమార్ తెలిపారు.

నిజానికి ఈరోజు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఖర్గేలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. శివకుమార్ మాట్లాడుతూ, ఈరోజు నా పుట్టినరోజు, ఇక్కడే పూజ చేయాలి. పార్టీ కోసం నేను చేయాల్సిన పని చేశాను. కర్నాటక ప్రజలకు నాపై నమ్మకం ఉంది. 135 సీట్లు ఇచ్చారు. ఇంతకు మించిన బహుమతి ఏమి కావాలి?

ముఖ్యమంత్రి కుర్చీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు డీకే శివకుమార్‌. డీకే మద్దతుదారులు కూడా బలప్రదర్శనకు దిగుతున్నారు. నిన్న సీఎల్పీ భేటీ దగ్గర బలం చాటుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ, డీకే బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ మద్దతుదారులు హంగామా చేశారు. డీకే శివకుమారే సీఎం పదవి ఇవ్వాలంటూ నినాదాలతో హోరెత్తించారు.

సీఎం అభ్యర్థిని అధిష్టానమే ప్రకటించాలంటూ ఏకవాక్య తీర్మానం చేసింది కర్నాటక సీఎల్పీ. షాంగ్రిల్లా హోటల్‌లో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు పరిశీలకులు. హైమాండ్‌ పరిశీలకుడిగా సీనియర్ నేత సుశీల్‌కుమార్‌ షిండే హాజరయ్యారు. ఈ క్రమంలోనే సిద్ధ, డీకే శివకుమార్‌లకు ఢిల్లీకి పిలుపు వచ్చింది.

నిన్న సమావేశం జరుగుతున్న సమయంలో.. హోటెల్‌ బయట సిద్ధరామయ్య, ఢీకే శివకుమార్‌ అనుచరుల సందడి చేశారు. వారి హంగామా చూశాక.. కౌన్‌ బనేగా కర్నాటక సీఎం అనే అంశం మరింత ఉత్కంఠ రేపుతోంది. డీకే శివకుమార్‌ జెండాలతో ఆయన అభిమానులు హల్‌చల్‌ చేశారు. సిద్దూ అభిమానులు సైతం అదే రేంజ్‌లో హంగామా చేశారు.

మరోవైపు కర్నాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 18న కర్నాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణం చేయనున్నారు. అదే రోజున కేబినెట్‌ మినిస్టర్లుగా కొందరు సభ్యులు కూడా ప్రమాణం చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం