Student – Teacher: టీచర్‌పై స్టూడెంట్ పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఓ విద్యార్ధిని క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న టీచర్‌పై దాడికి పాల్పడింది. అదికూడా పెప్పర్ స్ప్రేతో. అమెరికాలోని టెన్నెసీలోని నాష్ విల్లేలో అనిటోచ్ హైస్కూల్ లో క్లాస్ జరుగుతుండగా ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ..
ఓ విద్యార్ధిని క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న టీచర్‌పై దాడికి పాల్పడింది. అదికూడా పెప్పర్ స్ప్రేతో. అమెరికాలోని టెన్నెసీలోని నాష్ విల్లేలో అనిటోచ్ హైస్కూల్ లో క్లాస్ జరుగుతుండగా ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ గూగుల్ లో సమాధానాలు వెతకడం, మెసేజ్ లు చేయడం చేస్తుంది. అది గమనించిన టీచర్ ఆమెవద్ద నుంచి ఫోన్ లాక్కున్నాడు. తన ఫోన్ తిరిగి ఇచ్చేయాలంటూ సదరు విద్యార్థిని ఆ టీచర్ పై పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది. అతను నొప్పి తట్టుకోలేక బాధపడుతున్నా పట్టించుకోకుండా టీచర్ చేతుల్లో నుంచి తన ఫోన్ లాక్కోడానికి ప్రయత్నించింది. అతను ఫోన్ ఇవ్వకుండా అక్కడ్నుంచి బయటకు వెళ్లాడు. టీచర్‌ని ఫాలో అయిన విద్యార్ధిని బయట మరోసారి టీచర్‌పై పెప్పర్ స్ప్రే చేసింది. అదంతా మిగతా విద్యార్ధులు చూస్తున్నా అడ్డుకోకపోగా నవ్వుతూ వినోదం చూశారు. తోటి ఉపాధ్యాయులు ఆ యువతికి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టెన్నెసీలో క్లాస్ రూంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంపై నిషేధం లేకున్నా.. క్లాస్ రూమ్‌లో ఫోన్ వాడకూడదనే రూల్ ఉంది. ఈ రూల్ ను ఉల్లంఘించడంతోనే ఫోన్ తీసేసుకున్నానని టీచర్ చెప్పారు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆ విద్యార్ధిని తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!