Shramik Shakti Manch To Help Find Jobs In Home States: భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో నిరుద్యోగం తాండవించింది. ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వారు ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డున పడ్డారు.
అయితే అలా కాకుండా ఏ రాష్ట్రాల్లో వారికి ఆ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.. అచ్చంగా ఇలాంటి ఆలోచనతో సరికొత్త నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో శ్రామిక్ శక్తి మంచ్ పేరుతో సరికొత్త పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీనిద్వారా కార్మికులు తమ సొంత రాష్ర్టాల్లోనే ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికోసం చేయాల్సింది సింపుల్‌గా 72086 35370 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు. వెంటనే ఓ పోర్టల్‌కు కనెక్ట్ అవుతుంది. తర్వాత వచ్చే ప్రశ్నలకు సమాధానమిస్తే మన నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు.. ఖాళీల వివరాలను వెల్లడిస్తుంది. ఈ వాట్సాప్ చాట్‌బోట్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) ఆవిష్కరించింది. డీఎస్‌టీకి చెందిన టెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ అసెస్‌మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్‌ఏసీ) శ్రామిక్ శక్తి మంచ్ పోర్టల్‌ను రూపొందించింది. ఇది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోని కార్మికులతో వాట్సాప్ ద్వారా అనుసంధానం అవుతుంది.
Also Read: Samsung: అద్భుతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందంటే..?