ఆ ఊర్లో చెప్పులు వేసుకుంటే నేరం.. కఠినమైన శిక్షలు విధిస్తారు.. ఎందుకంటే..

|

Jun 15, 2022 | 1:46 PM

గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మన ఇంట్లో కూడా చెప్పులు లేకుండానే నడుస్తుంటాము. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఊళ్లో ఎవరూ చెప్పులు వేసుకోరు. కాదని ఊర్లో ఎవరైన చెప్పులు వేసుకుని తిరిగితే వారు శిక్షార్హులుగా పరిగణిస్తారు..

ఆ ఊర్లో చెప్పులు వేసుకుంటే నేరం.. కఠినమైన శిక్షలు విధిస్తారు.. ఎందుకంటే..
Andman Village
Follow us on

సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పవిత్ర క్షేత్రాలకు, ప్రదేశాలను దర్శించినప్పుడు చెప్పులు బయటవదిలి వెళ్లడం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది. కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మన ఇంట్లో కూడా చెప్పులు లేకుండానే నడుస్తుంటాము. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఊళ్లో ఎవరూ చెప్పులు వేసుకోరు. కాదని ఊర్లో ఎవరైన చెప్పులు వేసుకుని తిరిగితే వారు శిక్షార్హులుగా పరిగణిస్తారు.. ఇంతకీ ఎక్కడా గ్రామం..? ఎంటా కథ.?

దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో అండమాన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 130 కుటుంబాలు నివసిస్తుండగా, వారిలో ఎక్కువ మంది రైతులే. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దానికి ఊరంతా పూజలు చేస్తారు. ఇంతకు మించి ఎవరూ గ్రామంలో చెప్పులు ధరించి వెళ్లడానికి అనుమతి లేదు. బయటి నుంచి ఎవరైనా గ్రామానికి వస్తున్నారంటే ఇక్కడే చెప్పులు వదిలేసి వెళ్లాల్సిందే..అంతే కాకుండా గ్రామంలో కూడా ప్రజలు చెప్పులు లేకుండానే తిరుగుతుంటారు.

గ్రామంలో ప్రజలు చెప్పులు లేకుండా నడవడం వెనుక మత విశ్వాసం ఉంది. నిజానికి, ఇక్కడి ప్రజలు గ్రామంలోని భూమి మొత్తాన్ని పవిత్రంగా భావిస్తారు. దానిని దేవుని ఇల్లుగా భావిస్తారు. రోడ్డుపై ఎంత ఆర్భాటం చేసినా చెప్పులు లేకుండా నడవడానికి ఇదే కారణం. చెప్పులు వేసుకుని రోడ్డుపై నడిస్తే దేవుడికి కోపం వస్తుందని గ్రామస్తులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ నివసించే దాదాపు 500 మందిలో వృద్ధులు మాత్రమే మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పుడు బూట్లు, చెప్పులు ధరించి నడవడానికి అనుమతిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇవి కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పంచాయతీ వారికి శిక్ష విధిస్తుంది