Viral News: అయ్యో పాపం.. డ్యాన్స్‌ చేస్తూ వేదికపై కుప్పకూలిన వరుడు.. మృతికి కారణమదే..!

Viral News: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు..

Viral News: అయ్యో పాపం.. డ్యాన్స్‌ చేస్తూ వేదికపై కుప్పకూలిన వరుడు.. మృతికి కారణమదే..!
Groom

Updated on: May 09, 2022 | 7:03 AM

Viral News: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు. అయితే అలాంటి పెళ్లి వేడుకల్లోనే ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా అలాంటి ఓ ఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.

తన పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు కుప్పకూలాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆటపాటలతో సందడి చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు. పెళ్లికి కొద్ది గంటల ముందే ఈ విషాదం చోటుచేసుకుంది. ఉన్నటుండి.. మితేష్‌లో ఎలాంటి కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కంగారుపడ్డారు. హుటాహుటిన బైక్‌పై అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ మితేష్‌ అప్పటికే మృతి చెందిన్నట్లు నిర్దారించారు.