Shock to Bollywood actress Kangana: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మరో షాక్ తగిలింది. ఆమెపై వర్గ ద్వేషాలను రెచ్చగొట్టారన్న అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి ఛండేల్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు నిర్దేశించింది.
సాహిల్ అష్రఫలీ సయ్యద్ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం విచారించిన బాంద్రా కోర్టు.. సోషల్ మీడియాలో కంగనా, ఆమె సోదరి రంగోలి చేసిన కామెంట్ల ఆధారంగా వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కంగనా కామెంట్లు హిందూ, ముస్లింల మధ్య వర్గ విద్వేషాలను పెంచేవిగా వున్నాయన్నది ఆమెపై ప్రధాన అభియోగం.
అష్రఫలీ సయ్యద్ పిటిషన్‌పై శనివారం విచారణ జరిపిన ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయ్‌దేవ్ వై ఘులే.. కంగానా చేసిన కామెంట్లు వర్గ విద్వేషాలను రెచ్చగొట్టేవిగా వున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాంతో ఆమెతోపాటు ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు.
Also read: దుబ్బాకలో వేడెక్కుతున్న ప్రచారం
Also read: చైనాకు భారత్ మరో ‘చెక్‘