Shashi Tharoor: గాయకుడి అవతారమెత్తిన శశిథరూర్‌.. కేంద్ర మాజీ మంత్రి టాలెంట్‌కు వీక్షకులు ఫిదా..

|

Sep 06, 2021 | 6:58 PM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశథరూర్‌ సరికొత్త అవతారమెత్తారు. గాయకుడిగా తన టాలెంట్ ఏంటో చూపించారు

Shashi Tharoor: గాయకుడి అవతారమెత్తిన శశిథరూర్‌.. కేంద్ర మాజీ మంత్రి టాలెంట్‌కు వీక్షకులు ఫిదా..
Shashi Tharoor
Follow us on

Shashi Tharoor – Sang: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశథరూర్‌ సరికొత్త అవతారమెత్తారు. గాయకుడిగా తన టాలెంట్ ఏంటో చూపించారు. ఇవాళ శ్రీనగర్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఓల్డ్ క్లాసిక్ సాంగ్ పాడి అందర్నీ ఆకర్షించారు. దూరదర్శన్‌ శ్రీనగర్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. అలనాటి బాలీవుడ్‌ క్లాసిక్.. 1974లో విడుదలైన ‘‘అజ్‌నబీ’’ చిత్రం నుంచి ‘‘ఏక్‌ అజ్‌నబీ హసీనా సే’’ అనే పాటను ఆలపించారు శశిథరూర్.  ఫోన్‌లో లిరిక్స్‌ చూస్తూ తన హావభావాలు ప్రదర్శిస్తూ.. పాట పాడుతూ ప్రేక్షకులను అలరించారు శశిథరూర్. మాజీ కేంద్రమంత్రి పాడటం మొదలుపెట్టగానే అందరూ సెల్‌ఫోన్లలో చిత్రీకరించడం ప్రారంభించారు.

పాట పూర్తయిన అనంతరం ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టి మాజీ కేంద్రమంత్రికి ప్రశంసలు కురిపించారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో దిట్టగా చెప్పుకునే శశిథరూర్‌ తనలోని సింగింగ్ టాలెంట్‌ కూడా ఇప్పుడు బయటపెట్టారు. ఇక, శశిథరూర్ పాడిన ఈ పాట ఒరిజినల్‌ను గాయకుడు కిశోర్‌కుమార్‌ పాడగా సినిమాలో హీరో హీరోయిన్లుగా రాజేష్‌ ఖన్నా, జీనత్ అమన్‌ నటించారు. దీని గురించి శశిథరూర్ కూడా ట్విట్టర్లో స్పందించారు.

‘‘ ఏమాత్రం ప్రాక్టీస్‌ చేయకుండా.. ఎంజాయ్‌ చేస్తూ పాడా’’ అంటూ ట్విటర్‌లో ఆయన రాసుకొచ్చి సదరు వీడియో పోస్ట్ చేశారు శశిథరూర్. కాగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

Shashi