Air India: హమ్మయ్యా.. పండగపూట తప్పిన పెను ప్రమాదం! పైలెట్ సమమస్ఫూర్తికి హ్యాట్సఫ్ చెప్పాల్సిందే

|

Oct 12, 2024 | 9:08 AM

పండగ ముంగిట పెను ప్రమాదం తప్పింది. గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్‌ ఇండియా ఫ్లయిట్‌ ఎట్టకేలకు తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం రాత్రి సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. ఐతే మూడు గంటల పాటు ప్రాణాలు గాల్లో అన్నంత ఆందోళన కల్గించాయి. ఎయిర్‌ ఇండియాకు చెందిన AXB613 ఫ్లైట్ విమానం..

Air India: హమ్మయ్యా.. పండగపూట తప్పిన పెను ప్రమాదం! పైలెట్ సమమస్ఫూర్తికి హ్యాట్సఫ్ చెప్పాల్సిందే
Air India Express Flight
Follow us on

చెన్నై, అక్టోబర్ 12: పండగ ముంగిట పెను ప్రమాదం తప్పింది. గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్‌ ఇండియా ఫ్లయిట్‌ ఎట్టకేలకు తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం రాత్రి సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. ఐతే మూడు గంటల పాటు ప్రాణాలు గాల్లో అన్నంత ఆందోళన కల్గించాయి. ఎయిర్‌ ఇండియాకు చెందిన AXB613 ఫ్లైట్ విమానం షెడ్యూల్‌ ప్రకారం.. తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరింది. సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు టేకాఫ్‌ అయిన కాసేపట్లోనే సాంకేతిక సమస్య తలెత్తింది. హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో ఎర్రర్‌ను గుర్తించిన పైలట్‌ వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చి ఎమెర్జెన్నీ ప్రకటించారు. 141మంది ప్రయాణికులు.. సిబ్బంది ఉన్న విమానం 2 గంటల పాటు గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. ల్యాండ్‌ చేయలేని పరిస్థితి నెలకొనడంతో సర్వత్రా టెన్షన్‌ చోటు చేసుకుంది.

ఇక ఈ విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మరోవైపు గ్రౌండ్‌లో ఆపరేషన్స్‌ స్పీడప్‌ అయ్యాయి. బెల్లీ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ల్యాండింగ్‌ టైమ్‌లో ఫైర్‌ క్యాచ్‌ చేసే ప్రమాదం వుంటుంది కాబట్టీ.. ఫ్యూయల్‌ బర్నింగ్‌ కోసం అదే పనిగా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. మరోవైపు రన్‌ వేపై ఫైర్‌ రెసిస్టన్స్‌ కుషన్‌ను సిద్దం చేశారు. డ్యామేజ్‌ కంట్రోల్‌కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తూనే సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం అన్ని రకాలుగా ప్రయత్నించారు. రెస్క్యూ ఆపరేషన్‌ కోసం 20 ఫైరింజన్లు.. 20 అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. భారీగా పారమిలటరీ బలాగాలను మోహరించారు.

ఇవి కూడా చదవండి

ఏటీసీ గైడెన్స్‌.. పైలట్‌ సమయస్పూర్తితో AXB613 ఫ్లైట్‌ను ఎట్టకేలకు సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 8.15 గంటలకు షార్ట్‌లో ల్యాండ్‌ కావాల్సిన ఫ్లయట్‌.. అదే టైమ్‌కు తిరుచ్చిలో సురక్షితంగా ల్యాండయింది. విమానంయలో వున్న 141 ప్రయాణికులు.. సిబ్బందితో ప్రాణాలు అరచేతిలో అన్నట్టుగా హడలిపోయారు. ల్యాండవ్వగానే పునర్జన్మ దొరికినంత సంతోషంగా పరుగులు తీశారు. దీంతో మూడు గంటలపై కొనసాగిన హైటెన్షన్‌కు ఎట్టకేలకు శుభం కార్డ్‌ పడినట్లైంది. థ్యాంక్‌ గాడ్‌… పైలట్‌ ఈజ్‌ అవర్‌ గాడ్‌ అంటూ కృతజ్ఞతలు చెప్పారు ప్రయాణికులు. టెక్నికల్‌ ఇష్యూను చాకచక్యంలో సెట్‌ చేసేలా ఏటీసీ గైడెన్స్‌ ఎంత ఉపయోగపడిందో.. పైలట్‌ సమయస్పూర్తి కూడా అంతే. సమస్యను పసిగట్టి సమాచారం ఇవ్వడం మొదలు.. ప్రయాణికులకు ధైర్యం చెప్తూ.. ఏటీసీ సూచనల మేరకు ఫ్యయల్‌ బర్నింగ్‌ కోసం గాల్లో చక్కర్లు కొట్టించడం.. ఇలా ప్రతీ ఫ్రేమ్‌లో సమయస్పూర్తి ప్రదర్శించారు పైలట్‌. మొత్తానికి మూడు గంటల పాటు హైవోల్టేజ్‌ టెన్షన్‌.. ఫ్లైట్‌ సేఫ్‌ ల్యాండింగ్‌తో సుఖాంతమైంది. చాకచక్యంతో వ్యవహరించిన విమానం పైలెట్, ఇతర సిబ్బందిని సీఎం స్టాలిన్‌ అభినందించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.