ఢిల్లీలోని షాహీన్‌బాగ్ (Shaheen Bagh)ప్రాంతంలో ఆక్రమణలపై బుల్‌డోజర్(Bulldozer)తో చెక్ పెట్టేందుకుఅధికారులు రంగంలోకి దిగారు. ఇందుకోసం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డిఎంసి) పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. MCD బుల్డోజర్ షాహీన్ బాగ్ ప్రాంతానికి చేరుకుంది. కాసేపట్లో ఆక్రమణల తొలగింపు పనులు ప్రారంభిస్తామన్నారు. అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఎస్డీఎంసీ అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ పాలిత సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ), కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. అక్రమ కట్టడాల పేరుతో చేపట్టిన కూల్చివేతలను వెంటనే నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానికులతో కలిసి ఆప్ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్ నిరసనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే తాను చెప్పడంతో ఇప్పటికే ప్రజలు అక్రమ నిర్మాణాలను తొలగించారని.. వాజుఖానా, మూత్రశాలలు గతంలోనే పోలీసుల సమక్షంలోనే తొలగించినట్లుగా వెల్లడించారు. ఇప్పుడు ఎలాంటివి అక్రమ నిర్మాణాలు ఇక్కడ లేవన్నారు. అయితే వారు మళ్లీ ఎందుకు వచ్చారు..? అది రాజకీయం కాదా..? అని ప్రశ్నించారు.
ఎస్డీఎంసీ అధికారులకు భద్రత కల్పించేందుకు సీనియర్ పోలీసు అధికారులు సైతం షాహీన్బాగ్కు చేరుకున్నారు. అక్రమ నిర్మణాల తొలగింపు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు పని చేయటం సహా వారి భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నాట్లుగా సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
జాతీయ వార్తల కోసం
ఇవి కూడా చదవండి: Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..
Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..