Kerala High Court: ‘ఎక్కడ టచ్ చేసినా.. అత్యాచారం చేసినట్లే’.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

|

Aug 06, 2021 | 12:55 PM

Kerala High Court: అత్యాచారానికి సంబంధించిన విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పురుషుడి అవయవంతో అమ్మాయి శరీరాన్ని ఎక్కడ తాకినా అది

Kerala High Court: ‘ఎక్కడ టచ్ చేసినా.. అత్యాచారం చేసినట్లే’.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Kerala High Court
Follow us on

Kerala High Court: అత్యాచారానికి సంబంధించిన విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పురుషుడి అవయవంతో అమ్మాయి శరీరాన్ని ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుందంటూ కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. బలాత్కారం సమయంలో కిరాతకంగా ప్రవర్తించే చర్యలన్నీ అత్యాచారం కిందకే వస్తాయని కేరళ ధర్మాసనం స్పష్టంచేసింది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగిక దాడి కేసుపై కేరళ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టులో నిందితుడు తాను లైంగిక దాడికి పాల్పడలేదని పేర్కొన్నాడు. కేవలం తన అంగంతో టచ్‌ చేశానని.. అది లైంగిక దాడికి కిందకు ఎలా వస్తుందంటూ కోర్టుకు వెల్లడించాడు.

అయితే.. నిందితుడి వాదనలను విన్న అనంతరం జస్టిస్ కె వినోద్ చంద్రన్, జియాద్ రెహమాన్ ల బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అత్యాచారంపై ఓ వివరణ ఇస్తూ.. భారత రాజ్యాంగంలోని సెక్షన్ 375 ప్రకారం.. అమ్మాయి జననాంగాలతో పాటు ఆమె శరీరంపై పురుషుడి అవయవం ఎక్కడ తాకినా అది అత్యాచారం (రేప్‌) చేసినట్లేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం బాధితురాలి వయసును ఆమె తరఫు న్యాయవాది నిర్ధారించకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

కాగా.. ఈ కేసు 2015 నాటిది.. రాష్ట్రంలోని తిరుమరది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Also Read:

Fake Police: నకిలీ ఖాకీ లీలలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

Tarun Chugh: ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి: బీజేపీ నేత తరుణ్ చుగ్