Cyclone Remal Video: మేఘాల అద్భుతం ఓవైపు.. రెమల్‌ విధ్వంసం మరోవైపు..! వైరలవుతున్న వీడియోలు..

|

May 27, 2024 | 1:46 PM

'రెమల్' తుఫాను బెంగాల్ తీరాలను తాకిన తర్వాత భారీ విధ్వంసం సృష్టించింది. ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య రెమాల్ తుఫాను తీరాన్ని తాకడానికి ముందు బంగాళాఖాతంలో చీకటి మేఘాలు కమ్ముకున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ మరింత వైరల్ గా మారింది. 

Cyclone Remal Video: మేఘాల అద్భుతం ఓవైపు.. రెమల్‌ విధ్వంసం మరోవైపు..! వైరలవుతున్న వీడియోలు..
Cyclone Remal
Follow us on

బెంగాల్‌లో రెమల్ తుఫాను గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బీభత్సం సృష్టించింది. రెమాల్ తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను ధాటికి చాలా ఇళ్ళు, పంట పొలాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ పెను విధ్వంసం చేసి వదిలివేసింది. రమాల్ తుపాను కారణంగా బెంగాల్‌లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఏజెన్సీ, కోల్‌కతా బెంగాల్‌లో రెమాల్ తుఫాను ‘రెమల్’ తుఫాను బెంగాల్ తీరాలను తాకిన తర్వాత భారీ విధ్వంసం సృష్టించింది. ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య రెమాల్ తుఫాను తీరాన్ని తాకడానికి ముందు బంగాళాఖాతంలో చీకటి మేఘాలు కమ్ముకున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ మరింత వైరల్ గా మారింది.

కోల్‌కతా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి

రమాల్ తుఫాను కారణంగా కోల్‌కతా రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. బెంగాల్‌లో ఇంకా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోని మోంగ్లా నైరుతి తీరానికి సమీపంలో తుఫాను తాకింది. ఆ తర్వాత అది బెంగాల్ తీరాన్ని తాకింది.

శిథిలాల కింద ఒకరు మృతి ..

‘రెమల్’ తుపాను కారణంగా బెంగాల్‌లోని పలు ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. భారీ భవనాలు సైతం ధ్వంసమయ్యాయి, కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి.

ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకిన తుఫాను ఉత్తరం వైపు కదలడం ప్రారంభించి, అలాగే కొనసాగుతోందని, సోమవారం క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..