Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని 50 శాతం తగ్గిస్తున్నాం.. సీఈఓ అదర్‌ పూనావాలా

|

Dec 08, 2021 | 4:16 AM

Covishield Vaccine:  దేశంలో కరోనా మమహ్మారి కారణంగా వ్యాక్సినేషన్‌ ఇంకా జోరుగా సాగుతోంది. కోవిడ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు అందుబాటులోకి..

Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని 50 శాతం తగ్గిస్తున్నాం.. సీఈఓ అదర్‌ పూనావాలా
Follow us on

Covishield Vaccine:  దేశంలో కరోనా మమహ్మారి కారణంగా వ్యాక్సినేషన్‌ ఇంకా జోరుగా సాగుతోంది. కోవిడ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి అర్డర్స్‌ లేనందున వచ్చే వారం నుంచి కొవిషీల్డ్‌ ఉత్పత్తిని 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో వ్యాక్సిన్‌ పెద్ద మొత్తంలో అవసరం అనుకుంటే పెద్ద ఉత్తిన వ్యాక్సిన్‌ ఉత్పత్తిని కొనసాగించాలని అనుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్స్‌ లేనందున వ్యాక్సి్‌న్‌ ఉత్పత్తిని 50 శాతం వరకు తగ్గించన్నట్లు చెప్పారు. ఒక వేళ అదనపు ఉత్పత్తి కావాలని కోరితే అప్పుడు సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు. కేంద్రం సర్కార్‌ సైతం 20 నుంచి 30 మిలియన్ డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచుతుందని అన్నారు.

ఎలాంటి ఆధారాలు లేవు..

అయితే ప్రస్తుతం సౌతాఫ్రికా వేరియింట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్‌ వచ్చిన నాటి నుంచి వ్యాక్సిన్‌ పని చేయడం గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్తవేరియంట్‌పై పని చేయవని నమ్మేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. లాన్సెట్ జర్నల్‌ ప్రకారం.. ఆస్ట్రాజెనెకా 80 శాతం సమర్థత కలిగి ఉందని తేలినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఉన్న టీకాలు ఒమిక్రాన్‌పై అంత ప్రభావం చూపే అవకాశం లేదంటూ మోడెర్నా సంస్థ అధ్యక్షుడు స్టీఫెన్‌ హోగ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పూర్తి సమాచారం తెలియకుండా ఆయన చేసిన ఈ ప్రకటన వెను కారణాలు ఏమిటో తనకు తెలియదన్నారు. సరైన సమాచారం లేకుండా అంచనా వేసేముందు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి:

Omicron Tension: శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్!

Corona-Omicron: అమెరికా అమ్మాయి.. ఆఫ్రికా అబ్బాయి.. కట్‌చేస్తే ముంబైలో పలకరించిన ఒమిక్రాన్..!