పిల్లలపై జులై నుంచి నోవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్ ..? సీరం సంస్థ యోచన… దరఖాస్తు సమర్పిస్తామన్న ఆదార్ పూనావాలా

| Edited By: Phani CH

Jun 17, 2021 | 8:11 PM

వచ్చే జులై నుంచి దేశంలో పిల్లలపై నోవావ్యాక్స్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించాలన్న యోచన ఉందని పుణెలోని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు.

పిల్లలపై జులై నుంచి నోవావ్యాక్స్  క్లినికల్ ట్రయల్స్ ..? సీరం సంస్థ యోచన... దరఖాస్తు సమర్పిస్తామన్న  ఆదార్ పూనావాలా
Novavax
Follow us on

వచ్చే జులై నుంచి దేశంలో పిల్లలపై నోవావ్యాక్స్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించాలన్న యోచన ఉందని పుణెలోని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. ఇందుకు తాము త్వరలో డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదానికి దరఖాస్తు చేస్తామని ఆయన చెప్పారు. నోవావ్యాక్స్ టీకామందును ఇక కోవోవ్యాక్స్ గా వ్యవహరిస్తూ సెప్టెంబరు నుంచి ఇండియాలో లాంచ్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలపై ఆంక్షలను అమెరికా ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ ఇవి ఇండియాకు చేరడంలో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయంటున్నారు. ఇలా ఉండగా సీరం సంస్థ భాగస్వామి అయిన నోవావ్యాక్స్ సంస్థ.. తమ వ్యాక్సిన్ ట్రయల్స్ లో 90 శాతం కన్నా ఎక్కువగా నాణ్యత కలిగినదని తేలినట్టు ప్రకటించింది. ఎన్ వీ ఎక్స్ నోవ్ -2375 పేరిట పేరిట గల ఇది వివిధ వేరియంట్లను తట్టుకోగలదని అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో రుజువైందని వివరించింది. అమెరికా, మెక్సికో దేశాల్లో సుమారు 30 వేలమంది వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించారని, యూఎస్ తో బాటు ఇతర దేశాల్లో సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి ఎమర్జెన్సీ వినియోగానికి తాము దరఖాస్తు చేసే అవకాశం ఉందని ఈ సంస్థ తెలిపింది.

ప్రస్తుతమున్న వేరియంట్లను ఈ వ్యాక్సిన్ 93 శాతం నివారించగలదని స్పష్టమైనట్టు ఈ కంపెనీ పేర్కొంది. ఇలా ఉండగా తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచే యోచనలో ఉన్నామని ఆదార్ పూనావాలా వెల్లడించారు. ఇప్పటికే చాలావరకు ఉత్పత్తి పెంచామని కానీ దీన్ని రానున్న నెలల్లో ఇంకా పెంచుతామని ఆయన చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Hyderabad Hijras Nuisance: హైదరాబాద్‌లో హద్దు మీరిన హిజ్రాలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే బట్టలిప్పేసి, అసభ్య ప్రవర్తన..!

Viral Video: గూగుల్ డూడుల్ పోటీలో విజేతకు షాక్.. వీడియో కాల్ చేసిన సుందర్ పిచాయ్