ఆగస్టుకల్లా తమ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతామని సీరం, భారత్ బయో టెక్ సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు రానున్న నాలుగు నెలలకు గాను తమ ప్రొడక్షన్ ప్లాన్ ను కేంద్రానికి సమర్పించాయి. తాము 10 కోట్ల డోసుల మేర ఉత్పత్తిని పెంచుతామని సీరం కంపెనీ, మేమైతే 7.8 కోట్ల డోసుల మేర పెంచగలుగుతామని భారత్ బయోటెక్ సంస్థలు పేర్కొన్నాయి. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు గాను మీ వ్యూహం ఏమిటని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీటిని కోరినట్టు తెలిసింది. జులై తాము 3.32 కోట్లు, ఆగస్టులో 7.82 కోట్ల డోసులను పెంచుతామని భారత్ బయో టెక్ కంపెనీ డైరెక్టర్ వి.కృష్ణమోహన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే సెప్టెంబరులో కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తాము తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని 10 కోట్ల డోసులకు పెంచుతామని సీరం సంస్థ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రొడక్షన్ పెంచడం ఖాయమని ఈ రెండు కంపెనీలూ స్పష్టం చేశాయి. కేంద్ర ఉన్నతాధికారుల బృందమొకటి ఇటీవల ఈ రెండు సంస్థలను సందర్శించి వీటి ఉగత్పాదక సామర్థ్యాన్ని పరిశీలించింది.
కాగా దేశంలో ఒక్కసారిగా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. అనేక రాష్ట్రాలు తాము ఇప్పట్లో ముఖ్యంగా 18-44 ఏళ్ళ మధ్య వయస్కులవారికి టీకామందు ఇవ్వలేమని చేతులెత్తేశాయి. పైగా ఉన్న వ్యాక్సిన్ కూడా ఎక్కువ రోజులకు సరిపడా లేదని ఢిల్లీ వంటి రాష్ట్రాలు పేర్కొన్నాయి. కేంద్రమే ఆదుకోవాలని ఈ రాష్ట్రాలు కోరుతున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ :పక్షి గూటిలోకి భారీ పైథాన్..! గూటిలో పక్షులు పరిస్థితి ..? షాకింగ్ వీడియో..: viral and shocking video.
తారక్ కు కాల్ చేసిన మెగాస్టార్..ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడన్న చిరంజీవి ..(వీడియో) : Chiranjeevi and NTR video.