కర్ఫ్యూ నీడలో అయోధ్య.. తుఫాన్ ముందు సైలెన్స్..?

అయోధ్య.. మరోసారి దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన అంశం. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో.. వెలువడే తీర్పు ఎలా ఉండబోతోందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో 144 సెక్షన్ పెట్టారు. తాజాగా అయోధ్య నగరంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అంతేకాదు.. అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడ నిర్భంద తనిఖీలు […]

కర్ఫ్యూ నీడలో అయోధ్య.. తుఫాన్ ముందు సైలెన్స్..?
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 12:12 PM

అయోధ్య.. మరోసారి దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన అంశం. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో.. వెలువడే తీర్పు ఎలా ఉండబోతోందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో 144 సెక్షన్ పెట్టారు. తాజాగా అయోధ్య నగరంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అంతేకాదు.. అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడ నిర్భంద తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఏం జరగబోతోందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అయితే అయోధ్యలో ఎలాంటి ఘటనలు జరగకుండా.. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఈ తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సున్నిత ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ప్రజలు పుకార్లను నమ్మవద్దని అయోధ్య పోలీస్ అధికారి అమన్ సింగ్ కోరారు. అంతేకాదు ఎవరైనా వదంతులను వ్యాపింపచేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే వచ్చే నెల 17వ తేదీలోపు తీర్పు రాబోతోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో.. డిసెంబరు 10వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. అయోధ్య పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగంపై కూడా నిషేధం విధించారు. అంతేకాదు.. 144 సెక్షన్ ముగిసే నాటికి బాణసంచా కాల్చడం పై కూడా చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వరుసగా 40 రోజుల పాటు వాదనలు విన్నది. అయితే సుదీర్ఘంగా జరిగిన ఈ వాదోపవాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు సీజేఐ రంజన్ గొగోయ్ తెలిపారు.

నవంబర్‌లోనే సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ లోపే తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే మళ్లీ ఈ కేసును.. నూతన ధర్మాసనం ముందు తిరిగి మొదటి నుంచి వివరించాల్సి వస్తుంది. గత 39 రోజులుగా సాగుతున్న అయోధ్య కేసును మొదట్లో అక్టోబర్ 18 నాటికి ముగించాలని ధర్మాసనం భావించింది. ఆ తర్వాత ఒకరోజు ముందే ముగించేశారు. ఇక ఈ వివాదం పై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరిపిన విషయం తెలిసిందే.

అయోధ్య రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి గతంలోనే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖాడా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..