Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఎటు చూసినా జనమే.. భారీ భద్రత మధ్య కోట్ల మంది పుణ్య స్నానాలు..

మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే కోట్లాది మంది వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. రోజురోజుకీ రద్దీ పెరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే..ఇటీవల సంగమ్ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. యోగి సర్కార్‌పై ప్రతిపక్షాలు మండి పడ్డాయి. ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శించాయి.

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఎటు చూసినా జనమే.. భారీ భద్రత మధ్య కోట్ల మంది పుణ్య స్నానాలు..
Maha Kumbh Mela 2025

Updated on: Feb 02, 2025 | 12:33 PM

మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే కోట్లాది మంది వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. రోజురోజుకీ రద్దీ పెరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే..ఇటీవల సంగమ్ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. యోగి సర్కార్‌పై ప్రతిపక్షాలు మండి పడ్డాయి. ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శించాయి. ఫలితంగా..ప్రభుత్వం అలెర్ట్ అయింది. మళ్లీ అలాంటి ప్రమాదం జరగకుండా సీఎం యోగి ఆదిత్యనాథ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేశారు. వసంత పంచమి సందర్భంగా దాదాపు 4-5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించే అవకాశాలున్నాయి. మౌని అమావాస్య నాటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వసంత పంచమికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కీలక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా రూట్‌ప్లాన్ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. కాళీ సడక్ నుంచి భక్తులు వచ్చి…త్రివేణి మార్గ్ ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అటు ఎంట్రీ పాయింట్‌తో పాటు ఎగ్జిట్ పాయింట్ వద్ద వీలైనంత మేర పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.

భక్తులు భారీగా తరలి వచ్చే అకాశముండడం వల్ల కొన్ని స్ట్రాటెజిక్ పాయింట్స్‌నీ ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు. ఆయా ప్రాంతాల్లో క్రౌడ్ కంట్రోల్‌కి ఈ సిబ్బంది పూర్తిగా సహకరించనుంది. ఇక కుంభమేళా ప్రాంగణాల్లో వన్ వే సిస్టమ్‌ని తీసుకొచ్చారు. తొక్కిసలాట జరిగే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ భారీగా బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు 44 ఘాట్స్‌లో వసంత పంచమి రోజున భక్తులు అమృత స్నానాలు ఆచరించనున్నారు. ఈ మేరకు పోలీసులు..భక్తులకు కొన్ని సూచలను చేశారు. నదీ స్నానం ఆచరించిన వెంటనే ఘాట్స్ నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ సారి రంగంలోకి దిగారు. వీధి వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లను ఆక్రమించకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వాళ్లని వేరే చోటుకు పంపించాలని సూచించారు. రెగ్యులర్ ప్యాట్రోలింగ్‌తో పాటు క్రేన్, ఆంబులెన్స్ సర్వీస్‌లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. లైటింగ్ కూడా అన్ని చోట్లా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలని, జీరో ఎర్రర్‌ విధానంతో ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

అయితే…మొన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై యోగి సర్కార్ చాలా సీరియస్‌గా ఉంది. ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటో విచారిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ప్రత్యేకంగా ఓ కమిషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలకు యోగి సర్కార్ రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..