GaneshChaturthi: సెక్యూరిటీ గార్డు అత్యుత్సాహం.. గణపతిని దర్శించుకోకుండానే వెళ్లిన బాలిక ఆత్మహత్య..

|

Sep 02, 2022 | 5:19 PM

తల్లి రాసి ఉంచిన లేఖలో కూతురు గీసిన బొమ్మ కూడా ఉంది. ఇందులో క్యూలో నిల్చున్న భక్తులకు కూర్చుకోవటానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరింది. గణపతి దర్శనం

GaneshChaturthi: సెక్యూరిటీ గార్డు అత్యుత్సాహం.. గణపతిని దర్శించుకోకుండానే వెళ్లిన బాలిక ఆత్మహత్య..
Lalbaugcha
Follow us on

GaneshChaturthi: హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్సో.. ముంబయి వాసులకు ‘లాల్‌బాగ్చా రాజా’ గణపతీ అంతే ప్రత్యేకం..! ముంబయిలోని లాల్‌బాగ్చా రాజాను (గణపతి) చూసేందుకు ప్రతి సంవత్సరం భక్తులు భారీగా తరలి వస్తుంటారు. గణేశోత్సవాల సందర్భంగా భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉంటుంది. లాల్‌బాగ్ రాజును చూసేందుకు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు,ప్రముఖులు కూడా క్యూ కడుతుంటారు. దర్శనం కోసం వచ్చే భక్తులు లాల్‌బాగ్ రాజా నవాస్‌పేటలో భక్తులు తమ కోర్కెలను లేఖ రాసి ఉంచుతారు. ఇందులో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ బాలిక తల్లి రాసిన లేఖ ప్రస్తుతం అందరినీ కలచి వేస్తుంది. వాషిలో నివసిస్తున్న ఈ మహిళా భక్తురాలు లాల్‌బాగ్ రాజుకు ఓ విన్నపం చేసింది.

వాషిలో నివసిస్తున్న ఓ మహిళ లాల్‌బాగ్ రాజుకు భావోద్వేగంతో లేఖ రాసింది. రెండేళ్ల క్రితం ఆ మహిళ కూతురు ఆత్మహత్య చేసుకుంది. 2019 లో ఆ అమ్మాయి, ఆమె తల్లి లాల్‌బాగ్చా రాజాను చూడటానికి వచ్చారు. వారిద్దరూ ఎనిమిది గంటల పాటు క్యూలో నిలబడ్డారు. ఇంతలో ఆ యువతి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగింది. దీంతో బాలిక దర్శనం చేసుకోకుండా తల్లితో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.. అదే రోజు బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

‘‘2019లో లాల్‌బాగ్ రాజా నవాసా క్యూలో నేను, నా కూతురు ఎనిమిది గంటల పాటు నిలబడ్డాం. కానీ క్యూ కదలలేదు. దీంతో ఆ బాలిక తీవ్రమైన కాళ్ల నొప్పులతో అవస్థ పడింది. కూతురి బాధ చూడలేక..ఆ తల్లి అక్కడి సెక్యూరిటీ గార్డుతో మాట్లాడేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అమ్మాయి మనసు నొచ్చుకునేలా, దుర్భాషలాడాడు సదరు సెక్యూరిటీ గార్డు..దాంతో తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే క్యూలైన్‌లోంచి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్లిపోయారు. పదే పదే సెక్యూరిటీ గార్డు దూషించిన మాటలే గుర్తు చేసుకున్న ఆ బాలిక చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆ తల్లి తన ఆవేదనను ఆ లేఖలోప్రస్తావించింది.
లేఖలో ఓ చిత్రం కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి

తల్లి రాసి ఉంచిన లేఖలో కూతురు గీసిన బొమ్మ కూడా ఉంది. ఇందులో క్యూలో నిల్చున్న భక్తులకు కూర్చుకోవటానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరింది. గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులకు క్యూలో కుర్చీలు వేయటం ద్వారా మరణించిన తన కూతురి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ లాల్‌బాగ్ రాజాకు ఆ తల్లి లేఖ రాసింది. ఈ ఫోటోను అమ్మాయి తీసిందని తల్లి ఈ లేఖలో పేర్కొంది. అలాగే, ఉత్తరం ప్రారంభంలో, కరోనా సంక్షోభం తర్వాత లాల్‌బాగ్ రాజు వస్తున్నాడని, కానీ అతనిని చూడాలని ఆశించిన నా కుమార్తె అజ్నా ఈ రోజు ఈ లోకంలో లేదని ఆ మహిళ బావోద్వేగాన్ని లేఖలో ప్రస్తావించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి