
పసిఫిక్ మహా సముద్రం మీదుగా ఎల్‌నినో భూతం తరుముకొస్తోంది, వానల్లేక రైతు చితికిపోతున్నాడు. తిండి గింజలక్కూడా నోచుకోక కోట్లాదిమంది కడుపులు నకనకలాడిపోతాయని కరువు సీన్లను ఊహించుకుని దేశం మొత్తం బెంబేలెత్తిపోతోంది. అది భవిష్యత్తులో దాపురించే ఆకలి సమస్య – పంటిబిగువున భరిస్తాం.. ఎలాగోలా నెట్టుకొస్తాం. కానీ, ఇప్పుడు పొంచి ఉంది జాతీయ అంతర్గత సమస్య. చిన్నసైజు శాంతిభద్రతల సంక్షోభం. ఇది పెద్ద సైజు కాకముందే మేలుకోవాలి. దేశ సార్వభౌమాధిపత్యాన్ని నిలబెట్టి నేరుగా ప్రశ్నిస్తున్న ఈ పరిస్థితి ఇంకా ముదిరితే పెనుప్రమాదం తప్పదు. అందుకే, మొగ్గలోనే తుంచడమెలా అని సోచాయిస్తోంది కేంద్రం. కానీ, ఇది జస్ట్‌లైక్ దట్ అలా పుట్టిన మూమెంట్ కాదు.. బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద కుట్రే ఉండొచ్చని అనుమానిస్తోంది ఇండియన్ ఇంటిలిజెన్స్. దేశంలో దొంగలు పడ్డారా? దేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ శక్తులు కుయుక్తులు పన్నుతున్నారా? భారతదేశాన్ని మరో శ్రీలంక, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్‌లా రావణకాష్టంగా మార్చాలని కుట్ర చేస్తున్నారా? ఒక్కటొక్కటిగా బ్రేకింగ్ న్యూస్ వింటున్న కొద్దీ జనం మెదళ్లలో పెద్దపెద్ద ప్రశ్నలే పుడుతున్నాయి. 2026, జూలై 20 సాయంత్రం.. ఢిల్లీ జన్‌పథ్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వైపు దారితీసే రోడ్లపై రణరంగం సీన్లు. కన్నాట్ ప్లేస్ సర్కిల్ – పిండ్ బలూచి దగ్గర రాళ్లు,...