
School Holiday: 18 నవంబర్ 2025 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ఉండనుంది. ఇటువంటి వార్తలు వింటే విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. అయితే ఈ సెలవు అన్ని రాష్ట్రాలకు కాదని గమనించడం ముఖ్యం. తమిళనాడు IMD జారీ చేసిన భారీ వర్షపాత హెచ్చరిక కారణంగా ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాలు ముందుజాగ్రత్తగా పాఠశాలలను మూసివేయాలని భావిస్తున్నారు.
ఇంతలో ఢిల్లీ NCR, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాలు పాఠశాలలను సాధారణంగా తెరిచే ఉంటాయి. కొత్త వాతావరణ హెచ్చరికలు లేదా పరిపాలనా సెలవులు ప్రకటించబడలేదు. 18 నవంబర్ 2025న పాఠశాల మూసివేతలపై స్పష్టమైన అప్‌డేట్‌లు రాష్ట్రాల వారీగా అందిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: PM Kisan Mandhan Yojana: పీఎం కిసాన్ స్కీమ్‌లో ఏడాదికి రూ.6000 వేలే.. కానీ ఈ పథకంలో రూ.36,000
భారీ వర్షపాతం, భారత వాతావరణ శాఖ జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ కారణంగా తమిళనాడులోని అనేక జిల్లాల్లోని పాఠశాలలు నవంబర్ 17, 2025న మూసి ఉన్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, ఇతర జిల్లాలు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియడంతో ముందస్తుగా పాఠశాలలు అప్రమత్తం అయ్యాయి. 18న పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.
రేపు ఢిల్లీ పాఠశాలలకు సెలవు ఉందా?
ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్‌లలో పాఠశాలలు నవంబర్ 18, 2025న తెరిచి ఉంటాయి. వర్ష హెచ్చరిక లేదు. కాలుష్య సెలవు లేదు. అన్ని తరగతులు, పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. అలాగే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పాఠశాలలకు ఎటువంటి సెలవు లేదు.
ఇది కూడా చదవండి: Best Bikes: భారత్‌లో 5 చౌకైన బైక్‌లు ఇవే.. రూ. 55,000 నుండి ప్రారంభం!
ఇది కూడా చదవండి: SBI నుండి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకోవడానికి మీ జీతం ఎంత ఉండాలి. EMI ఎంత?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి