కోవిడ్-19 ఎఫెక్ట్.. సీబీఎస్ఈ మిగతా పరీక్షల రద్దు..? సుప్రీంకోర్టు సూచన

| Edited By: Pardhasaradhi Peri

Jun 18, 2020 | 1:50 PM

కరోనా వైరస్ నేపథ్యంలో సీబీ ఎస్ఈ బోర్డు పరీక్షలకు సంబంధించి ఇంకా నిర్వహించని పరీక్షలను రద్దు చేసే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఈ బోర్డును కోరింది. ఇంటర్నల్ అసెస్ మెంట్ ద్వారా మార్కులు కేటాయించాలని కోరింది. పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల విషయంలో కోర్టు తాజాగా ఈ సూచన చేయడం విశేషం. జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు సూచన చేస్తూ.. వచ్ఛే మంగళవారం కల్లా ఏ సంగతీ తెలియజేయాలని […]

కోవిడ్-19 ఎఫెక్ట్.. సీబీఎస్ఈ మిగతా పరీక్షల రద్దు..? సుప్రీంకోర్టు సూచన
Follow us on

కరోనా వైరస్ నేపథ్యంలో సీబీ ఎస్ఈ బోర్డు పరీక్షలకు సంబంధించి ఇంకా నిర్వహించని పరీక్షలను రద్దు చేసే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఈ బోర్డును కోరింది. ఇంటర్నల్ అసెస్ మెంట్ ద్వారా మార్కులు కేటాయించాలని కోరింది. పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల విషయంలో కోర్టు తాజాగా ఈ సూచన చేయడం విశేషం. జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు సూచన చేస్తూ.. వచ్ఛే మంగళవారం కల్లా ఏ సంగతీ తెలియజేయాలని ఆదేశించింది. ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు పేరెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. జులై 1..15 మధ్య సీబీఎస్ఈ మిగతా పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ప్రబలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలను నిర్వహించడం సరికాదని తలిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకే నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఫలితాలను ప్రకటించేలా బోర్డును ఆదేశించాలని కూడా  అత్యున్నత న్యాయస్థానాన్ని వారు  కోరుతున్నారు.