Varavara Rao: విరసం నేత వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్‌ మంజూరు

|

Aug 10, 2022 | 3:22 PM

అదే ఏడాది నవంబర్‌లో ముంబయిలోని తలోజా జైలుకు తరలించారు. 2020లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫిబ్రవరి 2021లో..

Varavara Rao: విరసం నేత వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్‌ మంజూరు
Varavara Rao
Follow us on

Bhima Koregaon case: విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో పి.వరవరరావుకు వైద్యపరమైన కారణాలతో సుప్రీంకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. భీమా కోరేగావ్ కేసులో రావును ఆగస్టు 28, 2018న హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. 83ఏళ్ల రావు వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ వరవరరావు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు యూయూ లలిత్‌, అనిరుద్ధ బోస్‌, సుధాన్షు ధూలియా ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిని ఏ విధంగానూ దుర్వినియోగం చేయరాదని కోర్టు పేర్కొంది.

ఈ కేసు 31 డిసెంబర్ 2017న పూణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించినది కావడం గమనార్హం. ఈ ప్రసంగం మరుసటి రోజు కోరేగావ్-భీమాలో హింసకు దారితీసిందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పూణే పోలీసులు పేర్కొన్నారు. అనంతరం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించారు. రావును 2018 ఆగస్టు 28న హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి అరెస్టు చేశారు.

ఇండియన్ పీనల్ కోడ్, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదే ఏడాది నవంబర్‌లో ముంబయిలోని తలోజా జైలుకు తరలించారు. 2020లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫిబ్రవరి 2021లో హైకోర్టు ఆయనకు ఆరు నెలల మెడికల్‌ బెయిల్‌ను మంజూరు చేస్తూ.. శాశ్వత బెయిల్‌కు నిరాకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి