FD Frauds: ఇలా చేశారంటే మీ ఖాతాలో డబ్బులన్నీ మాయం.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న ఎస్‌బీఐ

| Edited By: Shiva Prajapati

Apr 13, 2021 | 8:07 AM

FD Frauds: దేశంలో పెరుగుతున్న బ్యాంకింగ్‌ మోసాలు, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారులను కోరింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌...

FD Frauds: ఇలా చేశారంటే మీ ఖాతాలో డబ్బులన్నీ మాయం.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న ఎస్‌బీఐ
Sbi
Follow us on

FD Frauds: దేశంలో పెరుగుతున్న బ్యాంకింగ్‌ మోసాలు, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారులను కోరింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి సోషల్‌ ఇంజనీరింగ్‌ మోసాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ హెచ్చరికలు జారీ చేసింది. గత వారం ట్విట్టర్‌ ద్వారా సోషల్‌ ఇంజనీరింగ్‌ మోసాలకు సంబంధించిన వివరాలు ఎస్‌బీఐ వెల్లడించింది. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్లు చేసిన వారి మాటలు నమ్మవద్దని, ఫోన్‌లో అకౌంట్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, సీవీవీ, కార్డు నెంబరు తదితర వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పవద్దని సూచించింది. ఇలాంటి వివరాలను బ్యాంకులు ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్ల ద్వారా అడగవని బ్యాంకు తెలిపింది.

కొంతమంది సైబర్‌ నేరస్థులు ఖాతాదారులకు ఫోన్‌ చేసి వారి పేరుతో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశామని నమ్మిస్తున్నారని, ఈ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ అందిస్తున్నట్లు నమ్మిస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత ఖాతాకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి డబ్బులను దొంగిలిస్తున్నారని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఇలాంటి సోషల్‌ ఇంజనీరింగ్‌ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఖాతాదారులు తమ బ్యాంకింగ్‌ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, లేకపోతే ఇబ్బందుల్లో పడిపోతారని హెచ్చరించింది.

ఫిక్స్‌ డిపాజిట్ల పేరుతో మోసాలు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆన్‌లైన్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్లను ఓపెన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. దీని ద్వారా సైబర్‌ మోసగాళ్లు సోషల్‌ ఇంజనీరింగ్‌ మోసాలకు పల్పడుతున్నారు. స్కామర్లు ముందు ఖాతాదారుల నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలతో ఒక ఆన్‌లైన్‌ ఎఫ్‌డీ అకౌంట్‌ను ఓపెన్‌ చేస్తారు. ఆ తర్వాత ఆ అకౌంట్‌కు కొంత డబ్బు బదిలీ చేస్తారు. ఖాతాదారులు పూర్తిగా నమ్మిన తర్వాత మోసగాళ్లు బ్యాంకు అధికారులమని నమ్మించి ఓటీపీ అడుగుతారు. దీని ద్వారా ఆన్‌లైన్‌ ఎఫ్‌డీ అకౌంట్లోని మొత్తం డబ్బును తమ సొంత ఖాతాకు బదిలీ చేసుకుంటారని ఎస్‌బీఐ తెలిపింది. అందుకే రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫోన్‌లు చేసిన నేరగాళ్లకు పొరపాటున పూర్తి వివరాలు తెలిపినట్లయితే ఖాతాలో డబ్బులన్నీ మాయమవుతాయని తెలిపింది.

 

ఇవీ చదవండి: RTGS: ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు ఆర్టీజీఎస్ విధానంలో నగదు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారా? అయితే ఆర్బీఐ ఇచ్చిన ఈ అప్ డేట్ మీకోసమే.. 

ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి రోజులు..! 17 నుంచి 28 శాతం పెరిగిన డీఏ.. ఎప్పటి నుంచి అమలవుతుందంటే..?