SBI PO Prelims Result : ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అభ్యర్థులు రిజల్ట్ ఏవిధంగా తెలుసుకోవాలంటే..

|

Jan 19, 2021 | 12:26 PM

SBI PO Prelims Result : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ప్రొబెషనరీ ఆఫీసర్‌(పీఓ) పరీక్ష 2021 ప్రాథమిక ఫలితాలు విడుదలయ్యాయి.

SBI PO Prelims Result : ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అభ్యర్థులు రిజల్ట్ ఏవిధంగా తెలుసుకోవాలంటే..
Follow us on

SBI PO Prelims Result : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ప్రొబెషనరీ ఆఫీసర్‌(పీఓ) పరీక్ష 2021 ప్రాథమిక ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను బ్యాంక్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో sbi.co.in/careers పొందుపరిచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి వెబ్‌సైట్‌‌ను సందర్శించి ఫలితాలను తెలుసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరి 4, 5, 6 తేదీల్లో పీఓ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో కూడా అర్హత సాధిస్తే ఇంటర్వూ రౌండ్‌కి హాజరవాలి. కాగా మెయిన్స్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ప్రక్రియలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. తుది ఎంపికైన అభ్యర్థులకు దేశంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వివిధ శాఖలలో ఉద్యోగాన్ని కేటాయిస్తారు.

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జనవరి 4, 5, 6,
2021 ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితం: జనవరి 18, 2021
ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్ష తేదీ: జనవరి 29, 2021
ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితం: ఫిబ్రవరి 2021
ఎస్బీఐ పీఓ ఇంటర్వ్యూ ప్రాసెస్: ఫిబ్రవరి / మార్చి 2021
ఎస్బీఐ పీఓ తుది ఫలితం: చివరిది మార్చి 2021 వారం