State Bank Of India: పెన్షనర్లకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌.. వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌.. ఎలా సబ్మిట్‌ చేయాలంటే..

|

Nov 02, 2021 | 12:28 PM

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ' పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా 'వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (వీఎల్‌సీ)

State Bank Of India: పెన్షనర్లకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌.. వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌.. ఎలా సబ్మిట్‌ చేయాలంటే..
Follow us on

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘ పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ‘వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (వీఎల్‌సీ)’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పెన్షన్‌ పొందుతున్న వృద్ధులు వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ (జీవన ధ్రువీకరణ పత్రం) సమర్పించే అవకాశం కలుగుతుంది. నవంబర్‌ 1 నుంచి ఈ కొత్త రకమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎస్‌బీఐ. ఇంతకుముందు పెన్షన్‌ పొందుతున్న వృద్ధులు సమీపంలో ఖాతా ఉన్న బ్యాంకు, పోస్టాఫీసు, వారికి సంబంధించిన పెన్షన్ ఆఫీస్‌ లేదంటే జీవన్‌ ప్రమాణ్‌ పోర్టల్‌లో కానీ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. అయితే కరోనాకు తోడు వృద్ధాప్య సమస్యలతో కొందరు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తమ బ్యాంకులో ఖాతా ఉన్న పెన్షనర్ల సౌలభ్యం కోసం ‘వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (వీఎల్‌సీ)’ సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఎస్‌బీఐ. ఈ సేవలకు సంబంధించి నిమిషం నిడివి గల వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఎస్‌బీఐ..లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఎలా సమర్పించాలో స్టెప్‌ బై స్టెప్‌ వివరించింది.

వీడియో కాల్‌ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రం ఎలా సమర్పించాలంటే..
1. ఎస్‌బీఐ పెన్షన్‌ సేవా పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి.
2.లైఫ్‌ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్‌ చేసే ప్రక్రియను ప్రారంభించడం కోసం ‘వీఎల్‌సీ’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. మీ ఎస్‌బీఐ పెన్షన్‌ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.
4. అనంతరం మీ రిజిష్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
5. అక్కడ పొందు పరచిన నిబంధనలు, షరతులు పూర్తిగా చదివి అంగీకారం తెలిపి ‘స్టార్ట్‌ జర్నీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
6. మీ ఒరిజినల్‌ పాన్‌ కార్డ్‌ను సిద్ధంగా పెట్టుకుని ‘ఐయామ్‌ రడీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
7. వీడియో కాల్‌ ప్రారంభించడానికి మీరు ఓకే చెప్పిన తర్వాత సంబంధిత ఎస్‌బీఐ అధికారి అందు బాటులోకి వచ్చి మీతో మాట్లాడతారు.
8. వీడియో కాల్‌లోకి వచ్చిన ఎస్‌బీఐ అధికారి మీ స్ర్కీన్‌పై ఉన్న నాలుగంకెల ధ్రువీకరణ కోడ్‌ను చదవమంటారు. మీరు ఆ కోడ్‌ను అతనికి చెప్పాల్సి ఉంటుంది.
9. మీ దగ్గర సిద్ధంగా ఉన్న పాన్‌కార్డును బ్యాంక్‌ ఆఫీసర్‌కి చూపించి, దాన్ని ఫొటో తీసుకోవడానికి అనుమతి నివ్వాలి. దీంతో ఆ ఎస్‌బీఐ అధికారి మీ ఫొటోను కూడా తీసుకుంటారు.
10. దీంతో ‘వీఎల్‌సీ’ ప్రక్రియ పూర్తవుతుంది.
11. ఒకవేళ ఏ కారణంతోనైనా లైఫ్‌ సర్టిఫికెట్‌ తిరస్కరణకు గురైతే.. బ్యాంకు మీకు ఎస్సెమ్మెస్‌ పంపుతుంది. అందులో వీఎల్‌సీ రిజెక్ట్‌ కావడానికి గల అంశాలను వివరిస్తుంది. ప్రత్యామ్నాయంగా మీరు పెన్షన్‌ అందజేసే బ్యాంకు ఖాతాకు వెళ్లి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చు.

Also Read:

Festival Season Effect: అక్టోబర్‌లో ఫాస్టాగ్‌ వసూళ్లు ఎంత పెరిగాయంటే..

India Covid Cases: దేశంలో తగ్గిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య.. 259 రోజుల కనిష్ఠ స్థాయికి..

Viral News: కిలో స్వీట్ ధర రూ. 11,000.. ఏంటి బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..