Shivkumar Sharma Passed Away: ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్(Santoor) వాయిద్యకారుడు పండిత్ శివకుమార్ శర్మ (84) మంగళవారం కన్నుమూశారు. తన ప్రత్యేక శైలితో సంతూర్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో భాగం చేయడమే కాకుండా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన ఆయన భారత ప్రభుత్వం నుంచి 1991లో పద్మశ్రీ , 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మృతికి ప్రధాని మోడీ సహా పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.
పండిత్ శివకుమార్ శర్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ప్రధాని మోడీ అన్నారు. భారత దేశ సాంస్కృతిక ప్రపంచం మరో కలికితురాయిని కోల్పోయింది. ఆయన సంగీతం రాబోయే తరాలను ఉర్రూతలూగిస్తూనే ఉంటుందని చెప్పారు. అంతేకాదు..తాను ఎప్పుడూ శివకుమార్ శర్మ ప్రేమగా గుర్తుంచుకుంటానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధాని మోడీ సానుభూతి తెలిపారు.
Our cultural world is poorer with the demise of Pandit Shivkumar Sharma Ji. He popularised the Santoor at a global level. His music will continue to enthral the coming generations. I fondly remember my interactions with him. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 10, 2022
‘‘పండిత్ శివకుమార్ మరణం సంగీత ప్రపంచానికి తీరనిలోటు. హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి ఆయన స్వరపరిచిన ‘శివ హరి’ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆయన కుటుంబానికి, విద్యార్థులకు, అభిమానులకు శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని తెలుపుతూ బాలీవుడ్ గాయకుడు విశాల్ డడ్లాని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
‘‘మీరు లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అంటూ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సంతాపం తెలిపారు.
పండిట్ శివకుమార్ శర్మ పదమూడేళ్ల వయసులో సంతూర్ నేర్చుకోవడం ప్రారంభించారు. సంతూర్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో, తన శైలితో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అతని మొట్టమొదటి ప్రదర్శన 1995లో ముంబైలో ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..