అభిమానులకు శుభవార్త చెప్పిన సంజయ్‌దత్

|

Oct 21, 2020 | 4:52 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన కుమార్తె షహరాన్...

అభిమానులకు శుభవార్త చెప్పిన సంజయ్‌దత్
Follow us on

Sanjaydutt shared good-news with fans: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన కుమార్తె షహరాన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు.

తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ మేరకు ట్వీట్ చేశాడు సంజయ్ దత్. తాను అనారోగ్యం నుంచి కోలుకుని, పూర్తి ఆరోగ్యంగా వున్నానని ఆయన ట్వీట్ చేశారు. తనకు క్యాన్సర్ వుందని తెలిసినప్పట్నించి, తిరిగి కోలుకునే దాకా చాలా డిఫికల్ట్‌గా కాలం గడిచిందని సంజయ్ దత్ పేర్కొన్నారు.

‘‘ గత కొన్ని వారాలు తనకు, తన ఫ్యామిలీ మెంబర్స్‌కి గడ్డుకాలంగా భావించాలి.. దేవుడు అతికష్టమైన యుద్ధాలను అత్యంత సమర్థులైన సైనికులకే ఇస్తారు.. తానలాగే భావించి ఈ రోజు క్యాన్సర్‌ను జయించి నార్మల్ అయ్యాను.. నా కుమార్తె పుట్టిన రోజున ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఆనందంగా వుంది’’ అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు.

Also read: స్వప్నా సురేశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్