AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadhguru: సద్గురు చెప్పిన 7 నిమిషాల మైండ్ ట్రిక్.. మీ జీవితమే మారిపోతుంది..

మీ మైండే అసలు సూపర్ పవర్.. టెక్నాలజీ, ఆవిష్కరణల వెనుక ఉన్నది మన మనస్సే. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సద్గురు కీలక సందేశం ఇచ్చారు. మైండ్‌ని మేనేజ్ చేయకపోతే డేంజరే అని హెచ్చరించిన ఆయన.. మనసు బాధ్యత తీసుకోవాలంటే రోజుకు 7 నిమిషాలు చాలని సింపుల్‌గా చెప్పారు.

Sadhguru: సద్గురు చెప్పిన 7 నిమిషాల మైండ్ ట్రిక్.. మీ జీవితమే మారిపోతుంది..
Sadguru's World Mental Heal
Krishna S
|

Updated on: Oct 10, 2025 | 10:27 AM

Share

ఈ భూమ్మీద ఉన్న అన్నింటికన్నా పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉందా అంటే అది మన మైండ్ మాత్రమే. మనం కనిపెట్టిన అద్భుతమైన టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు.. అన్నిటికీ ఈ మైండే కారణం. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు ప్రజలకు గొప్ప సందేశాన్ని అందించారు. మనిషి జీవితంలో మనసు పోషించే కీలక పాత్రను ఈ సందేశం నొక్కి చెప్పింది. మనిషి మైండ్ ఈ భూమిపైనే అత్యంత శక్తివంతమైన, అసాధారణమైన సాధనంగా సద్గురు అభివర్ణించారు. దాన్ని సామర్థ్యం అపారం అని, అది మానవ చరిత్రలో అనేక అద్భుతాలను సృష్టించిందని తెలిపారు. మానవ మేధస్సుకు నిదర్శనంగా నిలిచిన అత్యంత ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి వెనుక ఉన్నది మన మనస్సేనని స్పష్టం చేశారు.

సంఘర్షణలకు మూలం మనస్సే

మైండ్ శక్తి కేవలం నిర్మాణాత్మకమైనది మాత్రమే కాదని సద్గురు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న అన్ని కలహాలు, సంఘర్షణలు, మానవతా సంక్షోభాలకు మనసే కారణమని ఆయన గుర్తుచేశారు. అంటే, మన మైండ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, దాన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే అంతే డేంజర్ అని చెప్పారు. ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నాడు ఈ అద్భుతమైన సాధనం అయిన మన మైండ్ బాధ్యతను మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

రోజుకు 7 నిమిషాలు చాలు..

మైండ్ శ్రేయస్సు అనేక అద్భుతాలను సృష్టించేందుకు దోహదపడుతుందని సద్గురు అన్నారు. ఈ దిశగా అడుగులు వేయడానికి ఆయన మనకు ఒక చిన్న ఛాలెంజ్ విసిరారు. మన మైండ్‌ను పక్కాగా, హ్యాపీగా ఉంచుకోవాలంటే.. రోజుకు కేవలం 7 నిమిషాలు కేటాయించాలని సూచించారు. అవును.. ఈ 7 నిమిషాలు మనకోసం మనం టైమ్ కేటాయిస్తే, మన మనస్సు హెల్తీగా ఉంటుంది. దానివల్ల మన లైఫ్ స్టైల్, మనం చేసే పనులు, మన చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ అద్భుతంగా మారతాయని సద్గురు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..