పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం!

పాకిస్థాన్ సైన్యం జరిగిన కాల్పుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. ఇప్పుడు మరో యువ జవాన్‌ కూడా వీరమరణం పొందారు. జమ్మూలో పాక్ కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం!
Jawan Sachin Yadav Wananje

Updated on: May 10, 2025 | 1:47 PM

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యం జరిగిన కాల్పుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. ఇప్పుడు మరో యువ జవాన్‌ కూడా వీరమరణం పొందారు. జమ్మూలో పాక్ కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందారు. సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహం తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సాధారణ పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..