Goa: గోవాలో అనుమానాస్పదంగా రష్యా మహిళ.. ఆమె ఇంట్లో సోదాలు చేయగా..

|

Nov 09, 2024 | 11:33 AM

పర్యాటక ప్రాంతం గోవా.. ఎవరికి వరంగా మారుతోంది? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ ఎంజాయ్ చేయడానికి చాలామంది వెళ్తుంటారు. అంతవరకు ఓకే. కానీ అక్కడ ఓ గబ్బు అక్కడికి వెళ్లినవారిని వెంటాడుతుంది.

Goa: గోవాలో అనుమానాస్పదంగా రష్యా మహిళ.. ఆమె ఇంట్లో సోదాలు చేయగా..
Goa Beach (Representative image)
Follow us on

గోవా అంటే అందమైన బీచ్‌లు.. చౌకగా దొరికే లిక్కర్.. పసందైన సీ ఫుడ్. నిజమే… గోవా భూతల స్వర్గం. కంటికి కన్పించే సహజ అందాల కన్నా కన్పించని అథో మత్తు జగత్‌ కోసమే యువత గోవాలో వాలడం ఆందోళన కల్గించే అంశం. గోవా డ్రగ్‌ హబ్‌ అని..డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకడం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఫ్రెండ్స్‌ సరదాగా వెళ్లివస్తామంటే..గోవాకే కదా అని దండిగా డబ్బులు ఇచ్చి పంపించే పేరెంట్స్‌ ఖచ్చితంగా క్రాస్‌ చేసుకోవాలి. లేదంటే చివరకు మిగిలేది దిగులే. గోవాకు పంపడం..వెళ్లడం తప్పు కాదు.కానీ గోవాకు ఎందుకు వెళ్తున్నారో..ఏం చేయడానికో తెలుసుకోకపోతే మాత్రం ముప్పు తప్పదు.

తాజాగా  రూ. 16 లక్షల విలువైన గంజాయి, MDMA డ్రగ్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఒక రష్యన్ మహిళను గోవా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుకాలు అల్లా రుసేవా ఉత్తర గోవాలోని పెర్నెమ్‌లోని ఓ క్లబ్‌లో డీజేగా పనిచేశారి ఓ అధికారి తెలిపారు. యాంటీ నార్కోటిక్స్ సెల్ బృందం గురువారం కేరీలోని రుసావా అద్దెకు తీసుకున్న గదిలో సోదాలు చేసి 36.16 గ్రాముల గంజాయి, 337 గ్రాముల MDMA, రూ.16.8 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మాస్కోకు చెందిన మహిళను నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..