పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన రష్యా రాయబారి! దాడి గురించి ఏమన్నారంటే..?
పహల్గామ్ ఉగ్రదాడిపై రష్యా తీవ్రంగా ఖండించింది. రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, ఈ దాడిని దారుణమైన నేరం అని అభివర్ణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోడీకి సానుభూతి సందేశం పంపారు. దోషులను గుర్తించి శిక్షించాలని రష్యా కోరుకుంటోంది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని రష్యా స్పష్టం చేసింది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెల 22న జరిగిన ఉగ్రదాడిపై రష్యా రాయబాది తమ అభిప్రాయం వెల్లడించారు. ఉగ్రదాడిపై భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. “ఏప్రిల్ 22న జరిగింది దారుణమైన నేరం. దీనిని విస్తృతంగా ఖండించారు. ఈ విషాదం గురించి తెలుసుకున్న వెంటనే అధ్యక్షుడు పుతిన్ సహా రష్యా అంతా భారత్‌కు మద్దతు తెలిపింది. ప్రధాన మంత్రి మోడీకి ప్రత్యేక సందేశం కూడా పంపారు, సానుభూతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా దోషులను గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షించాలని మేం ఆశిస్తున్నామని కూడా పేర్కొన్నారు. భారత్ చివరికి అదే చేసింది. ఉగ్రవాదంపై ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని మేం గతంలోనే చెప్పాం.”
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

