బ్రేకింగ్..చెన్నై కోలీవుడ్‌లో ఐటీ రైడ్స్.. పట్టుబడ్డవి చూస్తే షాక్..

| Edited By: Pardhasaradhi Peri

Feb 06, 2020 | 2:13 PM

రెండోరోజు తమిళనాడులో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. చెన్నై, మధురలోని తమిళ నటుడు విజయ్, సినీ నిర్మాణ సంస్థ ఏజీఎల్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అటు ఫైనాన్షియల్ అన్బుచెలియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేపడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు.. లెక్కల్లో లేని రూ. 24కోట్ల పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా ఐటీ అధికారులు గుర్తించారు. బిగిల్ సినిమా పారితోషికం రూ.50 కోట్ల లెక్కలపై కూడా విచారిస్తున్నారు. మరోవైపు..తమ అభిమాన హీరో […]

బ్రేకింగ్..చెన్నై కోలీవుడ్‌లో ఐటీ రైడ్స్.. పట్టుబడ్డవి చూస్తే షాక్..
Follow us on

రెండోరోజు తమిళనాడులో ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. చెన్నై, మధురలోని తమిళ నటుడు విజయ్, సినీ నిర్మాణ సంస్థ ఏజీఎల్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అటు ఫైనాన్షియల్ అన్బుచెలియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేపడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు.. లెక్కల్లో లేని రూ. 24కోట్ల పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా ఐటీ అధికారులు గుర్తించారు. బిగిల్ సినిమా పారితోషికం రూ.50 కోట్ల లెక్కలపై కూడా విచారిస్తున్నారు.

మరోవైపు..తమ అభిమాన హీరో విజయ్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విజయ్ ఇంటికి చేరుకుంటున్నారు. తమ హీరోపై బీజేపీ టార్గెట్‌ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు దిగారు. దీంతో విజయ్‌ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి.. విజయ్ ఇంటివద్దకు రాకుండా అభిమానులను అడ్డుకున్నారు.

ఐటీ రైడ్స్‌ రీజన్..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏజీఎస్‌… ఇటీవల నటుడు విజయ్‌ హీరోగా బిగిల్‌ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించింది. దీనికి దర్శకుడిగా అట్లీ వ్యవహరించారు. ఈ సినిమా గతేడాది దీపావళి రోజు రిలీజ్ అయ్యింది. కాగా బిగిల్‌ చిత్రం తమకు నష్టం కలిగించిందని నిర్మాతలు అంటుంటే, బయ్యర్లు మాత్రం ఫుల్ ఫ్రాఫిట్స్‌ను అందించిందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకవైపు నష్టాలంటే.. మరోవైపు లాభాలేంటని.. దీనిపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు బిగిల్‌ చిత్ర నిర్మాత ఇంటిలో, కార్యాలయంలో బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. వారికి పలు కీలక డాక్యుమెంట్లు లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హారోగా నటించిన విజయ్‌ను విచారించాలని ఐటీ అదికారులు భావించారు. దీంతో స్థానిక సాలిగ్రామంలోని విజయ్‌ ఇంటిలో, నీలాంగరై, కానాత్తుర్‌లోని ఆయనకు చెందిన మరో రెండు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.