RRC Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1154 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

|

Jan 28, 2025 | 7:19 AM

ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని బీహార్‌ రాష్ట్రం పాట్న రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి అర్హతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

RRC Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1154 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
RRC Railway Jobs
Follow us on

ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని బీహార్‌ రాష్ట్రం పాట్న రైల్వేలో.. డివిజన్‌, యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఆర్‌సీ తన ప్రకటనలో వెల్లడించింది. దనపుర్‌ డివిజన్‌, ధన్‌బాద్‌ డివిజన్‌, పండిట్‌ దీన్‌దాయాల్‌ ఉపాద్యాయ డివిజన్‌, సోన్‌పుర్‌ డివిజన్‌, సమస్తిపుర్‌ డివిజన్‌, ప్లాంట్‌ డిపోట్, క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌/ హర్నాట్‌, మెకానికల్‌ వర్క్‌షాప్‌/ సమస్తిపుర్‌.. డివిజన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,154 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డిజిల్‌), మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, టర్నర్‌, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్.. తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యూలేషన్‌ లేదా పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్‌ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు సడలింపు ఇస్తారు.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 25, 2025 నుంచి ప్రారంభమైనాయి. ఫిబ్రవరి 14, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100 చొప్పున ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపే సమయంలో చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈస్ట్ సెంట్రల్‌ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.