అధికారం కోసం తాము బీజేపీతో గానీ, ఆర్ ఎస్ ఎస్ తో గానీ చేతులు కలపలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. గయలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన.. తమది ప్రాంతీయ పార్టీ అని, ఇప్పటివరకు బీజేపీతో లేదా ఆర్ ఎస్ ఎస్ తో రాజీ పడలేదని చెప్పారు. నా ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రిని కావాలనుకుంటే కమలం పార్టీతో మిలాఖత్ అయి ఉండేవాడిని అన్నారు.2017 లో నితీష్ కుమార్ మహాఘట్ బంధన్ తో సంబంధాలను తెంచుకోవడంద్వారా బీహార్ ప్రజలను మూర్ఖులను చేశారని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.