‘370 అధికరణం రద్దును నేనూ ఆహ్వానించా.’. జ్యోతిరాదిత్య సింధియా

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణం రద్దుపట్ల  తను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడే సుముఖత వ్యక్తం చేశానని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

'370 అధికరణం రద్దును నేనూ ఆహ్వానించా.'. జ్యోతిరాదిత్య సింధియా
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 19, 2020 | 12:27 PM

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణం రద్దుపట్ల  తను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడే సుముఖత వ్యక్తం చేశానని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఆర్టికల్ ని రద్దు చేశారని, ఈ విషయాన్ని కనీసం ఎవరూ ఊహించలేదని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. మీ ఓట్లను ‘శివ్-జ్యోతి ఎక్స్ ప్రెస్’ కి వేయాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, తన పేరును కలిపి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. 1980 ప్రాంతంలో కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాను , తన తండ్రిని ఇద్దరినీ కలిపి ప్రజలు ‘మోతీ-మాధవ్ ఎక్స్ ప్రెస్’ గా వ్యవహరించేవారని, ఇప్పుడు మీ ముందు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ ఉన్నారని అన్నారు. నవంబరు 3 న మీరు ఈ ‘ఎక్స్ ప్రెస్’ కే ఓట్లు వేయండి అని సింధియా కోరారు. ఈ రాష్ట్రంలో 28 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆ రోజున బైపోల్ జరగనుంది.