జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లకు పాకిస్తాన్ కుట్ర, పొంచి ఉన్న ఉగ్రవాదులు
జమ్మూ కాశ్మీర్ లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను తరలించడం ద్వారా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అల్లర్లను రెచ్ఛగొట్టాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ ఇందుకు వ్యూహాలు రచిస్తోందని...
జమ్మూ కాశ్మీర్ లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను తరలించడం ద్వారా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో అల్లర్లను రెచ్ఛగొట్టాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ ఇందుకు వ్యూహాలు రచిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. కరేన్ సెక్టార్ లో పలు చోట్ల సుమారు 80 మంది టెర్రరిస్టులు కనిపించినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. నీలం వ్యాలీ సమీపంలో జైషే, లష్కరే ఉగ్రవాద సంస్థలకు చెందిన పది మంది ఉగ్రవాదుల బృందం పొంచి ఉందని, ఏ సమయంలోనైనా భారత భూభాగంలోకి చొరబడాలని చూస్తోందని సమాచారం. మరోవైపు పాకిస్థాన్ లోని సుజయన్ ఏరియా సమీప గ్రామాల్లో నలభై మంది టెర్రరిస్టులు ఉన్నారని అంచనా.. వీరితో పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నదని తెలుస్తోంది.